రాష్ట్రీయం

రాజగోపాల్ రెడ్డికి షోకాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్‌లను జారీ చేసింది. కోదండరెడ్డి అధ్యక్షతన సోమవారం నాడు క్రమశిక్షణా కమిటీ గాంధీ భవన్‌లో భేటీ అయ్యింది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన క్రమశిక్షణా కమిటీ రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. ప్రధాని నరేంద్రమోదీని పొగడటం అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని అవమానించడమేననే అభిప్రాయానికి విచ్చింది. కాంగ్రెస్ పార్టీనీ, రాహుల్‌గాంధీని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై క్రమశిక్షణా కమిటీ రాజగోపాల్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక పక్క రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ జారీ చేస్తూనే మరో పక్క ప్రస్తుత స్థితిపై పార్టీ కేంద్ర కమిటీకి నివేదికను సమర్పించింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులపైనా వచ్చిన ఫిర్యాదులను సైతం కమిటీ పరిశీలించింది. సంబంధిత బాధ్యులను కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ఫోన్ చేసిన మాట నిజమే: జగ్గారెడ్డి
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి తనతో ఏం మాట్లాడారనేది తాను బయటకు చెప్పలేనని అన్నారు. రాజకీయ అంశాలపై ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నుండి ఎవరూ టీఆర్‌ఎస్, బీజేపీలోకి వెళ్లే ఆలోచన చేయరని పేర్కొన్నారు. తాను మళ్లీ పార్టీ మారతానంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అయితే, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే పార్టీకి పూర్తి సమయం కేటాయిస్తానంటూ ఇప్పటికే స్పష్టంగా చెప్పానని గుర్తుచేశారు. తనకు పదవి ఇస్తే పార్టీని బలోపేతం చేస్తానని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి లేదని, పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉందని అన్నారు. నాయకులు అయోమయంలో ఉన్నారే కానీ క్యాడర్ కాదని చెప్పారు. రాజకీయాల్లో లోపాలు లేని నాయకుడు ఎన్ని విమర్శలు అయినా చేయవచ్చని, లోపాలు ఉన్న నాయకులు కాదని అన్నారు.