రాష్ట్రీయం

ఎమ్మెల్యే క్వార్టర్లు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు అత్యాధునిక వసతులతో కూడిన నివాస గృహ సముదాయాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. గృహాల ప్రారంభోత్సవానికి శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నూతన నివాస గృహ నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 166 కోట్లను ఖర్చు చేసింది. గృహాల కోసం దాదాపు 4.26 ఎకరాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కొత్తగా నివాస గృహాలను ప్రభుత్వం నిర్మించింది. గృహ నివాసాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కుటుంబ సమేతంగా తరిలిరావడంతో సందడి నెలకొంది. హైదర్‌గూడలో పాత నివాస గృహాలను కూల్చివేశారు. ఆదర్శనగర్‌లో కొత్తగా నివాస గృహాలను ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోసం 120 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ 2500 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. కొత్త గృహాల సముదాయం 12 అంతస్థులతో కూడిన ఐదు బ్లాక్‌లను నిర్మించారు. ఒక్కో అంతస్థుకు 10 ఫ్లాట్లు చొప్పున ఉంటాయి. ఒక్క్ఫో్లట్‌లో పెద్దల పడక గది, పిల్లల పడక గది, కార్యాలయం, వంట గది, సరుకుల నిల్వ గదులను నిర్మాణం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సహాయకుల కోసం 120 ఫ్లాట్లను నిర్మించారు. ఐటీ, వౌలిక వసతుల కోసం 1.25 లక్షల చదరపు అడుగులతో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం భద్రత కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 12 అంతస్థుల భవనాన్ని ఎక్కడానికి దిగడానికి దాదాపు ఎనిమిది లిఫ్టులు ఏర్పాటు చేశారు. నివాస గృహ సమదాయంలో దాదాపు 276 వాహనాలను పార్కింగ్ వసతి కోసం ఆధునిక పద్దతులతో నిర్మాణాలు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సందర్శకులు కలుసుకోవడానికి ప్రత్యేకంగా 23 గదులు ఉన్నాయి. ప్రాంగణంలో క్లబ్‌హౌస్, వ్యాయామశాల, సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహ సముదాయాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నివాస గృహ సముదాయాల కోసం చేసిన ఏర్పాటు కోసం చేసిన కార్యక్రమానికి అధికార, అనధికార వర్గాలతో పాటు ప్రజా ప్రతినిధులు తరలిరావడంతో ఆదర్శనగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

చిత్రం...హైదరాబాద్‌లో సోమవారం నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే నివాస భవనాలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్