రాష్ట్రీయం

ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం (హైదరాబాద్), జూన్ 17: ఉస్మానియా విశ్వవిద్యాలయం నాటి నుంచి నేటి వరకు పెద్ద బ్రాడ్ ఇమేజ్ కలిగియున్న యూనివర్సిటీ అని గవర్నర్ నరసింహన్ అన్నారు. సోమవారం ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 80వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధి కల్పించే సామర్థ్య కోర్సులను యూనివర్సిటీలు ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా ఓయూలో స్నాతకోత్సవం నిర్వహించకపోవడం బాధకరమని విచారణ వ్యక్తం చేశారు. గురుశిష్యుల మధ్య సంబంధం దృఢంగా ఉండాలని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే కాకుండా నిరంతరం తమ విధులను నిర్వహించాలని తెలిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఓయూ పూర్వ విద్యార్థి ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారత దేశం పట్ట్భద్రులతో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆకాంక్షించారు. మాజీ పీవీ నర్సింహా రావు, భగవంతం, ఎన్వీ సుబ్బారావు, కేడీ అభయం, సినారే, అజారుద్ధీన్, శాంతి నారాయణ్ వండి దేశం గర్వించదగ్గ మేధావులను ఓయూ అందించిందని చెప్పారు. నూతన జనరేషన్ ఉద్యోగాలు అడిగే ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరారు. పట్టుదలతో గమ్యం చేరడం కోసం అనేక ఆటుపోటులు వచ్చినప్పటికీ ముందుకు సాగినపుడే విజయం సాధిస్తారని తెలిపారు. విద్యాలయాలు విద్యార్థులు, గురువులు, తల్లిదండ్రులకు పేరు తెచ్చేవిదంగా ఉండాలన్నారు. గోల్డ్ మెడల్ పట్టాలు పొందిన విద్యార్థులు తమ పట్టుదలతో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 180 మంది విద్యార్థులకు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇంజనీరింగ్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకంతో సత్కరించారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన 789 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్దన్ రెడ్డి, ఓయూ వైస్ చాన్సలర్ ఎస్.రాంచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, ఎగ్జామినేషన్ కంట్రోలర్ శ్రీరాం వెంకటేశ్, డాక్టర్ సుజాత, డాక్టర్ అశోక్, శ్రీనివాసులు, ఇంజనీరింగ్ కళాశాల డీన్ లక్ష్మినారాయణ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ పాల్గొన్నారు.

చిత్రం... ఓయూ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్