రాష్ట్రీయం

నేటి నుంచి వారాంతపు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): ఏపీ పోలీసులకు వైఎస్ జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుశాఖలో వీక్లీ ఆఫ్ (వారాంతపు సెలవు) అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతస్థాయి పోలీసు అధికారుల సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ గౌతం సవాంగ్ ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని 23మంది ఉన్నత స్థాయి అధికారుల బృందం రాష్ట్ర వ్యాప్తంగా జోన్ల వారీగా అధ్యయనం చేసింది. ఈ కమిటీ నివేదిక మేరకు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన అత్యున్నత సమావేశంలో ‘వీక్లీ ఆఫ్ అమలు చేయాలని తీర్మానిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసుశాఖలో వారంతపు సెలవు విధానం అమలుకు సంబంధించి విధి విధానాలను శాంతి, భద్రతల అదనపు డీజీ రవి శంకర్ అయ్యన్నార్ మీడియాకు వెల్లడించారు. పోలీసుశాఖలో 30 విభాగాలు ఉన్నాయని, వాటిని అధ్యయనం చేసి మొత్తం 19 విధానాలను ఎంపిక చేశామన్నారు. యూనిట్ ఆఫీసర్లు వీటిలో నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చన్నారు. ప్రతి యూనిట్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని కొన్నిరోజులకు అవసరమైతే మార్పులు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రవేశపెట్టి అమలు చేయనున్న ఈ వీక్లీ ఆఫ్ విధానం రాష్ట్రంలో 70వేల మంది పోలీసులకు వర్తిస్తుందన్నారు. కానిస్టేబుల్ నుంచి సీఐ స్ధాయి వరకు వారంతపు సెలవు అమల్లోకి వస్తుందన్నారు. వీక్లీ ఆఫ్‌లతో షిఫ్టు డ్యూటీలు కూడా ఉంటాయన్నారు. అదే విధంగా 20 శాతం ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,300 ఖాళీలు ఉన్నాయని, కమిటీ రిపోర్టులో దీనిపై చర్చించినట్లు తెలిపారు. విశాఖ, కడప, ప్రకాశం జిల్లాల్లో ట్రైల్ నిర్వహించామని, దీనికి సంబంధించి ఇప్పటికే అధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామన్నారు. వీఐపీ, యాంటీ నక్సల్ డ్యూటీ కోసం ఇబ్బంది రాకుండా వీలైనంత త్వరగా ఖాళీలు భర్తీ చేస్తామని, అవసరం అనుకుంటే హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని వినియోగించుకుంటామన్నారు. వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చాక అవసరమైతే వీఆర్‌లో ఉన్నవారిని, పనిష్మెంట్లు తీసుకున్న వారిని కూడా సేవలకు తీసుకుంటామని అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఇలాఉంటే పోలీసుశాఖలో వారంతపు శెలవు అమలు సంచలన నిర్ణయమని పోలీసు అధికారుల రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు.