తెలంగాణ

వడదెబ్బతో ఎనిమిది మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/మహబూబ్‌నగర్/నిజామాబాద్/ఆదిలాబాద్/కరీంనగర్, ఏప్రిల్ 12: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో వడదెబ్బతో ఎనిమిది మంది మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండల పరిధిలోని ఉందేకోడ్ గ్రామానికి చెందిన మంగలి కృష్ణమ్మ (55) అనే మహిళ, నారాయణపేట పట్టణానికి చెందిన పోలేమోని వెంకటయ్య (50) అనే మేస్ర్తి, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు చెటిపెల్లి వీరేశం (58), వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన రైతు సంకూరి వెంకటేశ్వర్లు (47), నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని కందగట్ల గ్రామానికి చెందిన మల్లేష్ (22) అనే వ్యవసాయ కూలీ, మెదక్ జిలాల రామాయంపేట పట్టణానికి చెందిన మోచ మల్లయ్య (60), నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోగల గిర్ని తండాకు చెందిన కడావత బన్సీ (53) అనే పశువుల కాపరి, ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలంలోని పెద్దనపెల్లి పంచాయతీ పరిధిలో గల కొత్తకాలనీకి చెందిన బండారి రాజయ్య (55) వడదెబ్బ సోకి మంగళవారం మృతి చెందారు.

ఉపాధి పనుల్లో
బయటపడిన తపంచా!
గుండాల, ఏప్రిల్ 12: నల్లగొండ జిల్లా గుండాల మండలంలోని పల్లెపహడ్ గ్రామంలో మంగళవారం చింత భిక్షపతి అనే రైతు వ్యవసాయ భూమిలో ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా కూలీలు చెట్ల కొర్రులు తొలగిస్తుండగా కెనాన్ కంపెనీకి చెందిన తపంచా బయట పడింది. తపంచా తుప్పు పట్టిన తీరును చూస్తే చాలకాలం నుండి దానిని భూమిలో దాచినట్లుగా భావిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగించిన మావోయిస్టులే దీనిని ఇక్కడ దాచివుండవచ్చని అనుమానిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో సిమీ ఉగ్రవాదులు మోత్కూర్-గుండాల మధ్య సంచరించినప్పటికీ తపంచా శిథిలమైన పరిస్థితి మేరకు అంతకుముందుగానే దీనిని భూమిలో దాచినట్లుగా భావిస్తున్నారు. తపంచా లభ్యమైన సమాచారాన్ని ఉపాధి కూలీలు గ్రామ సర్పంచ్ కుసుమని హరీష్‌చంద్ర, వైస్ ఎంపిపి కాలి మల్లేష్‌కు తెలియచేయగా వారు తపంచాను స్వాదీనం చేసుకుని సిఐ బాలగోవింద్‌రెడ్డి, ఎస్‌ఐ రాజుకు అప్పగించారు.
పనామా కేసులో
రామారావు ఆస్తుల సీజ్
కేసముద్రం, ఏప్రిల్ 12: బ్యాంకు నుంచి 19 కోట్ల రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు కట్టకుండా బ్యాంక్ అప్పు ఎగవేతదారునిగా గుర్తించిన వరంగల్ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన చిల్లంచర్ల రామారావు అనే వ్యాపారికి చెందిన ఆస్తులను మంగళవారం రెవెన్యూ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్‌బిహెచ్ మేనేజర్ రాములు తెలిపారు. మేనేజర్ కథనం ప్రకారం.. రామారావు కొడకండ్ల మండలం వంగర గ్రామంలో చిల్లంచెర్ల అగ్రిటెక్ పేరుతో పార్‌బాయిల్డ్ మిల్లు ఏర్పాటు చేయడానికి కేసముద్రం ఎస్‌బిహెచ్ 2013లో 19 కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చిందన్నారు. అయితే బ్యాంకు రుణంతో మిల్లు ఏర్పాటు చేసిన రామారావు కిస్తులు సకాలంలో చెల్లించకపోవడం.. బ్యాంక్ తాఖీదులకు సమాదానం చెప్పకపోవడంతో రుణం ఎగవేతదారునిగా ప్రకటించామన్నారు. దీనితో కొద్ది నెలల క్రితం మిల్లును స్వాధీనం చేసుకోగా పూచీకత్తుగా పెట్టిన కేసముద్రం మండల కేంద్రంలోని రెండు గోదాములు, రైస్ మిల్లు, ఇల్లు, ఖాళీ స్థలాన్ని స్వాదీనం చేసుకున్నామని తెలిపారు.