రాష్ట్రీయం

సాగెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూన్ 16: సకాల నైరుతి రుతు పవనాల ప్రభావం కనిపించక పోవడంతో వ్యవసాయ పనులకు ఉద్యుక్తులైన అన్నదాతలు వరుణని కరుణ కోసం పరితపిస్తున్నారు. వర్షరుతువు ఆరంభ దశలో భూమి పదునుగా ఉన్నపుడు పునర్వసు కార్తెలో పునాస విత్తనాలు వేయడం ఆనవాయితీ. జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఎడ్లను, నాగలిని పూజించి, కర్షకుడు శుచి వస్తధ్రారియై వౌన ముద్రలో ఏరువాక కర్మను ఆచరించాలని పారస్కరుడు తన గృహ సూత్రాలలో వివరించాడు. హలకర్మకు జ్యేష్ఠా స్వాతీ నక్షత్రాలు మంచివని ఆయన పేర్కొన్నాడు. ఓషధీపతి అయన చంద్రుడు హలకర్మకు సునక్షత్రమైన జ్యేష్టకు దగ్గరగా ఉంటున్నందున కావలిన వస్తువులను ముందే సమకూర్చుకుని, ఏరువాకకు రైతు ఉపక్రమించడం పరంపరానుగతంగా వస్తున్నది. బండలు పగిలే భరణి కార్తె ఎండలు, రోళ్లు పలిగే రోహిణీ కార్తె ఎండలు వెనక బడి, మృగశిర కార్తెతో ముంగిళ్లు చల్ల బడితే, ఆమీద ఆరుద్ర వాన అదునువానగా, వ్యవసాయానికి అనువైన కాలంగా భావించ బడుతుంది. వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు దాటి, ఏరువాక పూర్ణిమ సైతం దాటగా, నైరుతి రుతు పవనాల జాడ కరువై, వాతావరణ అధికారుల అంచనా ప్రకారమే కేరళ తీరాన్ని జూన్ 8వ తేదీననే స్పృషించినా, అరేబియా సంద్రంలో వాయుగుండం పవనాలను అడ్డుకోగా, ఆశించిన సమయానికి రాష్ట్రానికి చేరక పోవడంతో రైతన్నలు ఒకింత చింతాక్రాంతులవుతున్నారు. నిజాం సాగర్‌లో వాస్తవ నీటి నిలువ 17.80టిఎంసిల సామర్థ్యానికి, ప్రస్తుతం 0.03 టిఎంసీలే ఉంది. శ్రీరాంసాగర్‌లో 90.31కి 5.66టిఎంసిల నిలువ ఉంది. సింగూర్‌లో 29.91కిగాను 0.49టిఎంసిలు; కడెంలో 7.60కు 2.34టిఎంసిలు; లోయర్ మానేర్ డ్యాంలో 24.07కు 3.73టిఎంసిలు, మిడ్ మానేరులో 25.87కు 3.48టిఎంసిలు, చివరగా ఎల్లంపెల్లిలో 20.18కు 5.02టిఎంసిల నీటి నిలువలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు రబీకోసం బోర్లపై ఆధిరపడక తప్పని స్థితి నెలకొంది. గత సంవత్సరం కన్నా ఈ ఏడు మే మాసంలో 1.83మీటర్ల కిందికి భూగర్భ జలాలు పడిపోయాయి. వర్షాలు కురిసి, ప్రాజెక్టులోనికి నీరు వచ్చినా, మిషన్ భగీరథ కోసం త్రాగునీరందించేందుకు నీటి నిలువలు సమకూరాకే, సదరు నీటిని అట్టే పెట్టి, తర్వాత సాగు నీటికి వినియోగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈఏడు రాష్ట్రంలో దాదాపు అంతటా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదైనాయి. రాష్ట్రంలో చిన్న, పెద్ద అధిక సంఖ్యాక నీటి వనరులు మండే ఎండలకు ఘోరాతిఘోరంగా ఎండిపోయాయి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ, రాష్ట్ర వ్యవసాయ శాఖల బాధ్యులు, రుతుపవన వర్షాలు ఆలస్యమవుతున్నందున, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వర్షాధార పంటలు వేసుకోవద్దని సూచించారు. పెసర, జొన్న జూన్ మాసాంతం వరకు, మొక్కజొన్న, పత్తి, చిక్కుడు జూలై మొదటి పక్షం వరకు, క,ది జూలై నెలాఖరు వరకు, ఆముదం ఆగస్టు రెండవ వారాంతం వరకు విత్తుకోవడానికి అనువైన సమయాలని స్పష్టం చేశారు. జలాశయాలలో నీటి లభ్యత తగ్గిపోవడం, భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో వర్షాధారులైన కర్షకులు ఆకాశంవైపు గంపెడాశతో చూస్తున్నారు. వాతావరణ అధికారుల ప్రకటనల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ స్థితిలో కలవరానికి గరవుతున్న అన్నదాతలు, వారిపై ఆధారపడే ప్రజలు వరుణ దేవుని కరుణా కటాక్ష వీక్షణాలకై అర్చనలు, ప్రార్థనలు, జపాలు, హోమాదులను నిర్వహిస్తున్నారు. ఈ నెల 22లేదా 23తేదీల వరకు రుతుపవనాలు చేరనున్నాయనే వాతావరణ అధికారుల అంచనాలు, సంబంధిత ప్రకటనలు రైతన్నలకు కాసింత ఊరట కలిగిస్తున్నాయి.