రాష్ట్రీయం

నాసా కాన్ఫరెన్స్‌లో సత్తా చాటిన సిద్దిపేట విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్: ప్రతిష్టాత్మకమైన అమెరికా వారి నాసా ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో సిద్దిపేటకు చెందిన విద్యార్థిని వాషింగ్‌టన్‌లో సత్తాచాటింది. ఈనెల 6 నుండి 9 వరకు నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట శ్రీచైతన్య పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ఐశ్వర్య కానె్ఫరెన్స్‌కు ఎంపికై సత్తాచాటింది. ఈ కాన్ఫరెన్స్ సమయంలో శ్రీచైతన్య విద్యార్థులు ప్రముఖ ఆస్ట్రోనాట్స్ (బూస్ మెలినిక్స్), క్రిస్ ఫెర్గూసన్, లను కలవడం, వారితో తామ భావాలను పంచుకోవడం విశేషం. నాసా అసెంబ్లీ బిల్డింగ్ లాంచింగ్‌పాడ్స్‌ను సందర్శించి ఆడ్వాన్స్‌డ్ టెక్నాలాజీ పరిజ్ఞానాన్ని ప్రముఖ సిటీలను, సందర్శనా స్థలాలను చూశారు. వాటిల్లో కేపిటల్ బిల్డింగ్, వైట్ హౌస్, వరల్డ్‌అబ్జర్వేటరీ, డిస్నీలాండ్ కోకోబీచ్, మెజికల్, కింగ్‌డమ్, కెనడీ స్పేస్ సెంటర్‌ను నయాగరఫాల్స్‌ను సందర్శించారు. ఆ దేశంలోని విజ్ఞానం, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి గురించివిద్యార్థులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య పాఠశాలల చైర్మెన్ యం శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డిజీం లక్ష్మణ్‌రావు, పాఠశాల ప్రిన్సిపాల్ ఎజాస్ అలీ, అకాడమీ డీన్ కనకరాజు తదితరులు విద్యార్థిని అభినందించారు.
చిత్రం... నాసా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సిద్దిపేట విద్యార్థిని ఐశ్వర్యను అభినందిస్తున్న దృశ్యం.