రాష్ట్రీయం

ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 19: తెలుగుదేశం ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ ఎట్టకేలకు బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేసినట్లు ఈఓకు అందించిన లేఖలో యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీటీడీ ధర్మకర్తల మండలికి సంబంధించి పలువురు రాజీనామాలు చేశారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని పుట్టా భీష్మించారు. భగవంతుని ముందు ప్రమాణం చేసి తన పదవికి రాజీనామా చేయడం ఇష్టం లేదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాను పదవిని వదులుకుంటానని యాదవ్ తొలి నుంచి చెబుతున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాలకు సంబంధించిన పాలకమండళ్ల చైర్మన్లు, సభ్యులు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత రాజీనామాలు చేయకుండా కాలం వెళ్లదీస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి పాలకమండళ్లను రద్దు చేయాలని జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం యోచిస్తూ వచ్చింది. పుట్టా సుధాకర్ లాంటి వారు రాజీనామా చేయకుండానే పదవుల్లో కొనసాగుతూ వచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా పుట్టా సుధాకర్ యాదవ్ బుధవారం రాజీనామా చేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నియమించిన నామినేటడ్ పదవుల్లో ఉన్నవారు తక్షణం రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందన్నారు. మంత్రి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే పుట్టా తన పదవికి రాజీనామా చేశారు.