రాష్ట్రీయం

వానమ్మా.. ఎక్కడమ్మా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 19: వాతావరణశాఖ అధికారులకు నైరుతి రుతుపవనాలు చుక్కలు చూపిస్తున్నాయి. సుమారు 20 రోజులుగా అంచనాల ప్రకారం రుతుపవనాల కదలిక ఉండకపోవడం అధికారులను గందరగోళానికి గురిచేస్తోంది. నైరుతి రుతుపవనాలు మొదట వేసిన అంచనా ప్రకారం ఈనెల 8వ తేదీ రాయలసీమలో ప్రవేశించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు పలు తేదీలు అంచనా వేసినా అవి వాస్తవరూపం దాల్చలేదు. చివరకు ఈనెల 20వ తేదీ తరువాత నైరుతి విస్తరణ సాధ్యమవుతుందని భావించినా ఆ తేదీని సైతం ఖచ్చితంగా నిర్ధారించలేని పరిస్థితి. నైరుతి రుతుపవనాలు సుమారు 12 రోజులు ఆలస్యంగా ఈ నెల 8వ తేదీన కేరళ తీరాన్ని తాకి విస్తృతంగా వర్షాలు కురిసినట్లు వెల్లడవుతోంది. అక్కడి నుంచి కర్నాటక తీర ప్రాంతం వరకు వచ్చి నిశ్చలస్థితిలో ఉండిపోయాయి. అరేబియా సముద్రంలో చెలరేగిన ‘వాయు’ తుపాను కారణంగా రుతుపవనాల కదలిక నెమ్మదించిందని లెక్కలు వేశారు. అయితే వాయు తుపాను అనుకున్న విధంగా ప్రభావితం చేయకపోగా రుతుపవనాలను కదలనీయకుండా చేశాయని అధికారులు వెల్లడిస్తున్నారు. కర్నాటక తీర ప్రాంతంలో తిష్టవేసిన రుతుపవనాలు తీరాన్ని తాకిన తరువాత రాయలసీమ వైపు పయనించాల్సి ఉంది. అయితే రుతుపవనాల్లో కదలిక ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా నిర్ధారించలేని పరిస్థితుల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా నైరుతి రుతుపవనాలు ఈనెల 20వ తేదీ నాటికి రాయలసీమలో ప్రవేశిస్తాయని నాలుగు రోజుల క్రితం అంచనా వేసినా ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. రాయలసీమలో నైరుతి విస్తరణకు మరో నాలుగు రోజుల సమయం పట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఏడాది నైరుతి ఎప్పుడు ప్రవేశించినా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న నైరుతి మున్ముందు ఎలాంటి పరిస్థితికి చేరుకుంటుందో స్పష్టం కావాల్సి ఉందని వెల్లడిస్తున్నారు. ఒకవేళ నైరుతి కర్నాటక తీర ప్రాంతం నుంచి దిశ మార్చుకుని పయనిస్తే మరిన్ని ఇక్కట్లు తప్పవేమోనన్న ఆందోళన వెంటాడుతోంది. నైరుతి రుతుపవనాల్లో కదలిక వస్తే గానీ రాయలసీమలో ఏరోజు ప్రవేశిస్తాయో అంచనా వేయలేని పరిస్థితి ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా నైరుతి రుతుపవనాలు ఈ సమయానికి మహారాష్టల్రో సైతం విస్తరించాల్సి ఉండగా సాధ్యం కాకపోవడంతో జూన్ నుంచి సెప్టెంబరు వరకు కురిసే వర్షాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారంటున్నారు. దీని కారణంగా ఖరీఫ్ సీజన్‌లో కరువు కాటు తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి సంగతి పక్కనపెడితే తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. నైరుతి రానున్న రోజుల్లో విస్తరించినా అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు. అయితే సుముద్రాల్లో చెలరేగే తుపానులు భారీ వర్షాలు కురిపిస్తే పరిస్థితిలో కొంత మేర మార్పు రావచ్చని భావిస్తున్నారు.