రాష్ట్రీయం

రాష్ట్రానికి రక్షణ కవచం టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణకు గత 18 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి రక్షణ కవచంగా నిలిచిందని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాలవాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. తెలంగాణ భవన్‌లో
బుధవారం పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయనున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు ఈ నెల 24న శంకుస్థాపన కార్యక్రమం జరుగనుందని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. దసరా పండుగ లోగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం రూ. 19 కోట్ల 20 లక్షలు పార్టీ నిధులను కేటాయించనున్నట్టు అధినేత కేసీఆర్ చెప్పారని పల్లా తెలిపారు. ఈనెల 27న పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అదే రోజు పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ స్వీకరణతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. జూలై నెలాఖరు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముగించాలని గడువు విధించినట్టు పల్లా తెలిపారు. సభ్యత్వ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సంబరాలు నిర్వహించుకోవాలని అధినేత కేసీఆర్ పిలుపునిచ్చినట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల నిరంతర విద్యుత్, ఇంటింటికీ శుద్ధి చేసిన మంచినీటి సరఫరాతో పాటు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రారంభిస్తున్నామని అధినేత కేసీఆర్ వెల్లడించినట్టు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణలో ప్రారంభించుకుంటున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం చేసిన సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ కార్యవర్గం తీర్మానం చేసినట్టు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వివరించారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో దాదాపు 85 శాతం సీట్ల సాధించడం పట్ల ఈ సందర్భంగా కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, శ్రేణులను అధినేత అభినందించారన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యులుగా ఉంటూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారన్నారు.
చిత్రం...టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్