తెలంగాణ

బౌరంపేట, దుండిగల్‌లో ఐటీ పార్కుకు ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: హైదరాబాద్ నగర శివార్లలో ఐటీ రంగం విస్తరణలో భాగంగగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బౌరంపేట్, దుండిగల్ గ్రామాల పరిధిలో 500 ఏకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ఈ గ్రామాల్లో ఐటీ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్న అసైన్డ్భూముల సేకరణకు, నిర్వాసితులయ్యే రైతులకు నిబంధనల మేరకు పరిహారం అందే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆయన ఎండీ నర్సింహారెడ్డిని ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ను కలిసి ఐటీపార్కును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రెండు గ్రామాల అసైన్డ్ రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ గ్రామాల్లో ఐదు వందల ఎకరాల అసైన్డ్భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. భూములు కోల్పోయే రైతులను ఆదుకోవాలని వారు టీఎస్‌ఐఐసీని కోరారు.