రాష్ట్రీయం

కాళేశ్వరం సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ ఇది ఒకనాటి మాట. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’ ఇది నేటి మాట. ఈ రాష్ట్ర బీడు భూములను పచ్చని మాగాణంగా మార్చేయబోయే తెలంగాణ వరప్రదాయినీ ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ స్వప్నం సాకారమయ్యేది నేడే. నీళ్లు, నిధులు, నియామకాలు మూడు ప్రధానమైన అంశాలపై సాధించుకున్న తెలంగాణలో నీటి గోసకు శాశ్వత పరిష్కారం లభించబోయే శుభదినం ఇది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తిపోతల ప్రాజెక్టుగా ఒక రికార్డు అయితే... కేవలం మూడేళ్ల వ్యవధిలోనే పూర్తయన భారీ ప్రాజెక్టుగా మరో రికార్డు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఒకేరోజు 21,589 క్యూబిక్ మీటర్ల సిమెంటు కాంక్రీట్ పనులు దుబాయిలో ఒక భవన సముదాయ నిర్మాణంలో జరిగాయి. ఆ రికార్డును కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అధిగమించడం మరో రికార్డు. భారీ ప్రాజెక్టుల నిర్మాణరంగంలో రికార్డులను తిరగరాసిన ప్రాజెక్టుగా కూడా కాళేశ్వరం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోనుంది. సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీటిని ఎత్తిపోస్తూ ఆరు దశల్లో 618 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లడమే కాకుండా సుమారు 203 కి.మీ సొరంగ మార్గం ద్వారా నీటిని తీసుకెళ్లడం ఈ ప్రాజెక్టులో మరో అద్భుతమైన, అరుదైన ఘట్టం. ఒక నీటిపారుదల ప్రాజెక్టులో ఇంతటి పొడవైన సొరంగ మార్గం నిర్మించడం భావితరాలకు ఈ ప్రాజెక్టు నిజంగా ఒక ‘చంద్రసేతు’గా నిలిచిపోతుందంటే అతిశయోక్తి కానేకాదు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో ఒక్క మహబూబ్‌నగర్ మినహా తొమ్మిది జిల్లాల్లో సాగుకు, తాగుకు, పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా రూపకల్పన చేసిన బహుళార్థక సాథక ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా మరో 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతాయి. ఈ ప్రాజెక్టుకు శుక్రవారం జరిగే ప్రారంభోత్సవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముగ్గురు ముఖ్యమంత్రులు తరలివస్తున్నారు. ప్రారంభోత్సవానికి ముందు భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజి, కనే్నపల్లి పంపుహౌస్ వద్ద రెండు చోట్ల ఉదయం మహా జలసంకల్ప హోమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్నారు. అనంతరం ముఖ్య అతిథులు చేరుకున్నాక వారితో ఒక్కొక్కరి చేత ఒక్కో పంపింగ్ మోటార్‌కు స్విచ్ ఆన్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించే శుభఘడియను తెలంగాణ వ్యాప్తంగా సంభరాలు జరుపుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.