రాష్ట్రీయం

ఆ కిరాతకుని తరఫున ఎవరూ వాదించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: మానవ మృగంలా మారిన కిరాతకుడి చేతిలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి శ్రీహిత మృతి పట్ల గురువారం కూడా ఆందోళనలు కొనసాగాయి. ఈ చర్యను అత్యంత హేయమైనదిగా ప్రకటిస్తూ వరంగల్ బార్ అసోసియేషన్ కార్యవర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ప్రవీణ్ తరఫున ఎవరూ వాదించకూడదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహరావు, కార్యదర్శి వినోద్‌కుమార్‌తో పాటు కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శ్రీహితను హత్య చేసిన దుండగుడ్ని వెంటనే శిక్షించాలని కోరుతూ తెలంగాణ అర్బన్ ఏరియాస్ డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఏకశిల పార్కు ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ దుశ్చర్యపై చర్చించి ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే కోర్టు తీర్పును వెలువడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో వరంగల్ యాసిడ్ దాడి నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన వరంగల్ పోలీసులు ఈ సంఘటన పట్ల ఎందుకు వౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాగా సాయంత్రం ఏకశిల పార్కు నుండి కాగడాల ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి మృతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, జిల్లా నాయకులు ఉషాకిరణ్ పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. సంఘటన పట్ల మంత్రి దయాకర్‌రావు తీవ్రంగా స్పందించి నిందితుడి పట్ల కఠినంగా చర్య తీసుకోవాలని కోరారు. మరో వైపు విద్యార్థి సంఘాలు కూడా బైకులపై ర్యాలీ నిర్వహించి నిందితుడుని తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.