రాష్ట్రీయం

వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండురోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. గురువారం కూడా ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నవీపేట (నిజామాబాద్) లో 8 సెంటీమీటర్లు, జూరాల ప్రాజెక్టువద్ద ఆరు సెంటీమీటర్లు, ఎడపల్లి (నిజామాబాద్) లో 5 సెంటీమీటర్లు, బాల్కొండలో 4,వేల్పూరు (నిజామాబాద్) లో 3, బోధన్‌లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, కామారెడ్డిలలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వానలు కురిశాయి. ఇలా ఉండగా నైరుతీ రుతుపవనాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో తెలంగాణకు రావచ్చని ఐఎండీ ప్రకటించింది.