రాష్ట్రీయం

24 నుండి టీ-ఎమ్సెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నట్టు ఎమ్సెట్ అడ్మిషన్స్ కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. 24వ తేదీ నుండి జూలై 1వ తేదీ వరకూ ఆన్‌లైన్ ఫైలింగ్, కీలక వివరాల నమోదు, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ , సర్ట్ఫికేట్ల పరిశీలనకు గడువు తదితర వివరాలను నమోదు చేయాలని, స్లాట్‌లను నముదు చేసుకున్నవారు తమ సర్ట్ఫికేట్లను జూన్ 27వ తేదీ నుండి జూలై 3వ తేదీలోగా వెరిఫికేషన్ చేయించుకోవల్సి ఉంటుంది. సర్ట్ఫికేట్ల పరిశీలన పూర్తి చేసుకున్న వారు తమ వెబ్ ఆప్షన్లను జూలై 27 నుండి జూలై 4వ తేదీ లోగా నమోదు చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ల ను కమిటీ జూలై 4వ తేదీ ఫ్రీజ్ చేస్తుంది. సీట్ల కేటాయింపు జూలై 6న జరుగుతుంది. ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌రిపోర్టింగ్ జూలై 6 నుండి జూలై 12 మధ్య పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే రెండోదశ కౌనె్సలింగ్ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14 ప్రభుత్వ కాలేజీల్లో 3055 సీట్లున్నాయి. మూడు ఫార్మసీ కాలేజీల్లో 180 సీట్లున్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 200 ఉన్నాయి. వాటిలో 1.05 లక్షల సీట్లున్నాయి. 124 ఫార్మసీ కాలేజీల్లో 10762 సీట్లున్నాయి. 60 ఫార్మా డీ కాలేజీల్లో 1770సీట్లున్నాయి.