రాష్ట్రీయం

గిరిజన జీవితాల్లో విప్లవాత్మక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: గిరిజన జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్‌లోకి ఆమె గురువారం లాంఛనంగా ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. గత ప్రభుత్వ హయంలో గిరిజన శాఖకు మంత్రిని సైతం నియమించలేదని, గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు.
గిరిజన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గిరిజన తండాలను పంచాయతీలుగా మార్పు వంటివి అమలు చేస్తామని స్పష్టం చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామని, ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ద్వారా పాలన జరుగుతుండగా, దానిలో కూడా సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రకటించారు. సమర్థులైన అధికారుల సేవలను ఉపయోగించుకుంటామని, తప్పు చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తన శాఖను ఇతర శాఖలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
కమ్యూనిటీ వర్కర్లకు జీతాల పెంపు ఫైల్‌పై తొలిసంతకం ఆమె చేశారు. గిరిజన ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు 19.97 కోట్ల రూపాయలను వౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మంజూరు చేసేందుకు పాలనాపరమైన ఆమోదం తెలిపే ఫైల్‌పై సంతకం చేశారు.
చిత్రం...బాధ్యతలు స్వీకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి