రాష్ట్రీయం

సచివాలయంలో భవనాల అప్పగింత పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న భవనాలన్నింటినీ గురువారం తెలంగాణ ప్రభుత్వం అధీనం చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. భవనాలను అప్పగిస్తూ ఏపీ జీఏడీ అధికారి రవి ఒక లేఖను తెలంగాణ జీఏడి అధికారి చిట్టిరాణికి గురువారం అందచేశారు. ఈ సందర్భంగా చిట్టిరాణి మాట్లాడుతూ, తెలంగాణకు ఈ రోజు శుభదినమన్నారు. మంగళవారం నాడు రెండు భవనాలను ఏపీ అధికారులు తెలంగాణ అధికారులకు అప్పగించగా, మిగిలిన భవనాలను గురువారం అప్పగించారన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో 2014 లో ఐదు భవనాలు (హెచ్-నార్త్, హెచ్-సౌత్, కే, ఎల్, జే, బ్లాకులను) ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ఐదు బ్లాకులు (్భవనాలు) నిన్నటి వరకు ఏపీ ప్రభుత్వ అధీనంలోనే ఉంటూ వచ్చాయి. 2014-15 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఈ భవనాలనే సచివాలయంగా వాడుకున్నాయి. అప్పట్లో ఏపీ సీఎం కోసం ఎల్ బ్లాను ఆధునీకరించారు. ఏడాది తిరగక ముందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయాన్ని అమరావతికి తరలించారు. దాంతో ఈ ఐదు భవనాలు ఆనాటి నుండి దాదాపు ఖాళీగానే ఉంటూ వచ్చాయి. కొద్దిమంది అధికారులు మాత్రం నామమాత్రంగా ఈ భవనంలోని కొన్ని గదులను ఉపయోగించుకుంటూ వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య జరిగిన చర్చలతో ఏపీ అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఇటీవల అంగీకారం కుదిరింది. గత నెల రోజుల నుండి అధికారికంగా భవనాల అప్పగింత కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. ఈరోజుతో అన్ని భవనాలను అప్పగించడం పూర్తయింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన లేఖను ఏపీ జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ డి. రవిబాబు, తెలంగాణ జీఏడీ డిప్యూటీ సెక్రటరీ చిట్టిరాణికి గురువారం అందించారు. ఈ సందర్భంగా చిట్టిరాణి మాట్లాడుతూ, తెలంగాణకు ఈరోజు శుభదినమని వర్ణించారు. ఈవాళ అన్ని భవనాలను అప్పగించారన్నారు. సచివాలయంలోని అన్ని భవనాలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పరిధిలోకి వచ్చాయన్నారు. భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వంతో సంత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. ఏపీ అధికారులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఏపీ జీఏడి అసిస్టెంట్ సెక్రటరీ రవిబాబు మాట్లాడుతూ, తక్కువ సమయంలో తమ అధినంలో ఉన్న భవనాలను ఖాళీ చేసేందుకు సహకరించిన తెలంగాణ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు.