రాష్ట్రీయం

ఉద్యమ విజయం.. కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/ చిన్నకోడూరు : తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణి కావాలనే కేసీఆర్ కలలు కన్న అద్భుతమైన కరవును పారదోలే ప్రాజెక్టు కాళేశ్వరం అని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకోవటం తెలంగాణ ఉద్యమ విజయమన్నారు. సిద్దిపేట నియోజక వర్గం చిన్నకోడూరులోఎంపీడీఓ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు అంతర్‌రాష్ట్ర వివాదంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి సారించి రాత్రింబవళ్లు ఇంజనీర్‌లా కష్డపడి ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపకల్పనగా చేశారన్నారు. రాష్ట్రం సాధించుకున్నది నీళ్లు, నిధులు కోసమే అన్నారు. తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ప్రజల గొప్ప విజయంగా భావిస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతాన్ని ఆవిష్కృతం కాబోతున్నట్టు తెలిపారు. కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తూ రికార్డు సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి కృషిచేసినట్టు తెలిపారు. ఈ ప్రాంతం ఏన్నో ఏళ్ల నుండి కరవుతో అల్లాడుతుందన్నారు. కరవు పీడిత ప్రాంతానికి కాళేశ్వరం ఒక వరమన్నారు. సిద్దిపేట నియోజక వర్గానికి మిడ్ మానేరు, అంతగిరి, రంగనాయక్‌సాగర్ ద్వారా మన ప్రాంతానికి తాగునీరు రానుందన్నారు. కరువును పారదోలే గొప్ప ప్రాజెక్టును గొప్ప విజయంగా నియోజకవర్గంలో పండుగలా సంబురాలు చేసుకోవాలన్నారు. గ్రామగ్రామాన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, మహిళ సంఘాలు, పార్టీ శ్రేణులు సంబురాల్లో పాల్గొని ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎండా, వాన, చలిని లెక్క చేయకుండ రేయింబవళ్లు శమించిన ఇంజనీర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆవిష్కరించే సన్నివేశాన్ని ఆనంద బాష్పాలతో తిలకిస్తున్న తెలంగాణ రైతుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. సస్యశ్యామల తెలంగాణ స్వప్నం సాకారం అయ్యేలా ఆశీస్సులు అందించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్‌రావు