రాష్ట్రీయం

అనాథలు, వృద్ధుల నడుమ పుష్పశ్రీ వాణి పుట్టిన రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి తన పుట్టిన రోజు వేడుకలను అనాథలు, వృద్ధుల మధ్య జరుపుకుని తన నిరాడంబరతను చాటుకున్నారు. పుష్పశ్రీ వాణి శనివారం విశాఖలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా విశాఖ డాబాగార్డెన్స్‌లోని ప్రేమసమాజం ఆవరణలో ఉన్న అనాథలు, వృద్ధుల ఆశ్రమానికి చేరుకున్నారు. వృద్ధులు, అనాథలను ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. వారి మధ్యనే కేక్ కట్‌చేసి, వారికి తినిపించి, తనూ తిన్నారు. అనాథ బాలలు, వృద్ధులను ఆలింగనం చేసుకుంటూ వారి యోగ, క్షేమాలు తెలుసుకున్నారు. వారికి అందుతున్న సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల ఆశీర్వాదం తీసుకుంటూ మరణించిన తన తల్లిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు చీరలు, దుప్పట్లు, అనాథ బాలలకు స్వీట్లు, పండ్లు, స్కూల్ బ్యాగ్‌లు, పుస్తకాలు పంపిణీ చేశారు. తన జీతం నుంచి రూ. 50వేలను ప్రేమసమాజానికి విరాళంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు ప్రేమసమాజం వ్యవస్థాపకుల నిర్యాణ మందిరంలో వారికి నివాళులర్పించారు. కార్యక్రమంలో అరకు, పాడేరు శాసనసభ్యులు చెట్టి లక్ష్మణుడు, కె.భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...పుట్టిన రోజు సందర్భంగా వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఓ వృద్ధురాలితో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి