రాష్ట్రీయం

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్‌ల మూకుమ్మడి బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వివిధ హోదాల్లో పనిచేస్తున్న 42 మందికి స్థాన చలనం కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీల వివరాలిలా ఉన్నాయి. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బుడితి రాజశేఖర్ విద్యాశాఖ కార్యదర్శిగా, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖలకు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న వై. మధుసూదనరెడ్డి వ్యవసాయ, సహకారశాఖ ముఖ్యకార్యదర్శిగా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బి. ఉదయలక్ష్మి కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ శాఖల ముఖ్య కార్యదర్శిగా బదిలీ కాగా ఆ స్థానంలో ప్రస్తుతం ఇంటర్‌బోర్డు కమిషనర్‌గా పనిచేస్తున్న కాంతీలాల్ దండే నియమితులయ్యారు. పో స్టింగ్ కోసం నిరీక్షిస్తున్న శశిభూషణ్ కుమార్ సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) (హెచ్‌ఆర్‌ఎం) ముఖ్య కార్యదర్శిగా, జీఏడీ (పొలిటికల్) విభాగంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్‌పీ సిసోడియాకు జీఏడీ (జీపీఎం అండ్ ఏఆర్) విభాగానికి ముఖ్యకార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగాను ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖేష్‌కుమార్ మీనాను గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. పురావస్తు, మ్యూ జియంల శాఖకు కమిషనర్‌గా ఉన్న వాణీ మోహన్ సహకారశాఖ, ఏపీ డీడీసీఎఫ్ (ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్) ఎండీగా నియమితులయ్యారు. పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న మరో ఐఏఎస్ అధికారి డి. వరప్రసాద్ కార్మికశాఖ కమిషనర్‌గా, యు వజన సర్వీసులు, స్టెప్ కమిషనర్‌గా పనిచేస్తున్న భానుప్రకాష్ ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ కాగా, ఆ పోస్టులో ప్రస్తుతం పనిచేస్తు న్న సీహెచ్ వెంకయ్యచౌదరి జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్ర్తి, శిశు సంక్షేమశాఖ స్పెషల్ కమిషనర్‌గా పనిచేస్తున్న హెచ్ అరుణ్‌కుమార్ వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌గా, అక్కడ పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఒగా నియమించారు. పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న కె కన్నబాబు ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ స్పెషల్ కమిషనర్‌గా, రెవెన్యూశాఖ అదనపు కార్యదర్శిగా బదిలీ కాగా, రెవెన్యూశాఖ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రసన్న వెంకటేష్‌ను విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం రామారావుకు ఏపీ బీసీ కోఆపరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న కార్తికేయ మిశ్రా ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, నేషనల్ హెల్త్ మిషన్ విభాగాలకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎ మల్లికార్జున ఆరోగ్యశ్రీ సీఈఒగా, ప్రకాశం జిల్లా జేసీగా పనిచేస్తున్న ఎస్ నాగలక్ష్మి ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీగా, చి త్తూరు జేసీగా పనిచేస్తున్న పీఎస్ గిరీష తిరుపతి మునిసిపల్ కమిషనర్‌గా ప్రస్తుతం తుడా (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) వీసీగా వి విజయరామరాజు ఏపీ మార్క్‌ఫెడ్, ఏపీ ఆగ్రోస్ ఎండీగా బదిలీ అయ్యా రు. శ్రీకాకుళం జేసీ చక్రధర్‌బాబును ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా, విశాఖపట్నం జేసీ గుమ్మళ్ల శ్రీజనకు విశాఖపట్నం కమిషనర్‌గా, అక్కడ పనిచేస్తున్న ఎం హరినారాయణను ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గంధం చంద్రుడును సాంఘిక సంక్షేమశాఖ, ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా నియమించి ట్రైబల్ వెల్ఫేర్ విభాగానికి డైరెక్టర్‌గా రంజిత్‌బాషాకు, ప్రకాశం జేసీగా సగిలి షాన్‌మోహన్‌కు ప్రకాశం జేసీగా పోస్టింగ్ ఇచ్చారు. సీతంపేట ఐటీడీఏ పీఒ శివశంకర్ విశాఖపట్నం జేసీగా, పార్వతీపురం ఐటీడీఏ పీఒ జి లక్ష్మిషాను తూర్పుగోదావరి జేసీగా బదిలీ చేశారు. గుంటూరు జేసీ హిమాంశు శుక్లాకు హ్యాండ్‌లూం, టెక్స్‌టైల్స్, ఏపీసీఒ డైరెక్టర్‌గా, ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఈఒ దినేష్‌కుమార్‌ను గుంటూరు జేసీగా, ఏపీసీఒ డైరెక్టర్ నాగరాణిని పురపాలకశాఖకు బదిలీ చేశారు. సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గుర్రాల శ్రీనివాసులును జీఏడీలో రిపోర్ట్ చే యాల్సిందిగా ఆదేశిస్తూ ఆ స్థానంలో ట్రైబల్ వెల్ఫేర్ అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న వి. చినవీరభద్రుడుని నియమించారు. గుంటూరు వాణిజ్యపన్నులశాఖ జా యింట్ కమిషనర్‌గా పనిచేస్తూ ఇటీవల ఐఏఎస్ హోదా పొందిన పి రాజబాబుకు సెర్ప్ సీఈఒగా పదోన్నతి కల్పించారు. కృష్ణా జిల్లా జేసి కృతికా శుక్లాను స్ర్తి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గాను, ఆ స్థానంలో ఉపాధికల్పనశాఖ డైరెక్టర్ కె మాధవీలతను నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఒ ఎం గౌతమిని వైఎస్సార్ కడప జేసీగా, అక్కడ పనిచేస్తున్న పి కోటేశ్వరరావును తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. కర్నూలు మునిసిపల్ కమిషనర్ పి ప్రశాంతి అనంతపురం కమిషనర్‌తో పాటు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి వైస్ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. విశాఖపట్నం డీఆర్‌డీఎ పీడిగా ఉన్న కె శ్రీనివాసులు శ్రీకాకుళం జేసీగా, సాధారణ పరిపాలనశాఖ (ఎన్నికలు) విభాగంలో సం యుక్త సీఈఒగా పనిచేస్తున్న డి మార్కండేయులు చి త్తూరు జేసీగా, రంపచోడవరం సబ్‌కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌ను పార్వతీపురం ఐటీడీఏ పీఒగా, రాజమం డ్రి సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న సీఎం సాయికాంత్ వర్మ సీతంపేట ఐటీడీఏ పీఒగా నియమితులయ్యారు. కాగా ఏపీ ఎస్‌పీఎఫ్ డీజీఎం ప్రతాప్‌ను స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ వీసీ, ఎండీగాను, వాటర్‌షెడ్ డెవలప్‌మెం ట్ విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్ రమణారెడ్డిని నెడ్‌క్యాప్ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.