రాష్ట్రీయం

నేడు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: నైరుతీ రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా శనివారం విస్తరించాయి. ఐఎండీ శనివారం అందించి సమాచారం ప్రకారం రుతుపవనాలు తెలంగాణను దాటి మహారాష్ట్ర, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలకు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం కూడా తెలంగాణలోని ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రస్తుతం ఒడిషాలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇదే సమయంలో బంగాళాఖాతంలో తుపాను ద్రోణి ఏర్పడి ఉంది. గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలోని గాంధారి లో 9 సెంటీమీటర్లు, ఎల్లారెడ్డిలో 8 సెంటీమీటుర్లు, బాన్స్‌వాడలో 7 సెంటమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు (యాదాద్రి భువనగిరి), హయత్‌నగర్, మద్దూరు (మహబూబ్‌నగర్), నాగిరెడ్డిపేట (కామారెడ్డి) లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురుగా వానలు కురిశాయి. రుతుపవనాల ప్రభావం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఎండలకు 46 డిగ్రీలకుపైగా మండిన రామగుండంలో గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భద్రాచలం (40 డిగ్రీలు) మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పగటి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు 35 నుండి 38 డిగ్రీల మధ్య నమోదైంది.