రాష్ట్రీయం

నిర్భయ చట్టం తరహాలో.. శ్రీహిత పేరున చట్టం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: శ్రీ హిత కుటుంబానికి అండగా ఉంటామని జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యుడు ఆచార్య తల్లోజు అన్నారు. ఇటీవల వరంగల్‌లో అత్యాచారం, హత్యకు గురైన 9 నెలల చిన్నారి శ్రీ హిత మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. శ్రీహిత కుటుంబానికి నేషనల్ లీగల్ ఆథారిటీ ద్వారా రూ. 17లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. హన్మకొండలోని కుమారపల్లిలో నివాసం ఉంటున్న శ్రీహిత కుటుంబ సభ్యులను తల్లోజు, వరంగల్ అర్బన్ జిల్లా సంయుక్త కలెక్టర్ దయానంద్‌లతో కలిసి పరామర్శించారు. అనంతరం సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నారి శ్రీహిత హత్య సంఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే విచారించదగ్గ విషయమని అన్నారు. ఇలాంటి సంఘటన చాలా బాధాకరమని ఆయన అన్నారు. శ్రీహిత తండ్రి జగన్, తల్లి రచనలకు సంతృప్తి పడే విధంగాసత్వర న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఇప్పటికే నిందితునిపై కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. నిందితునికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడే విధంగా జిల్లా పోలీసు యంత్రాంగం ముమ్మరంగా విచారణ చేపట్టిందని చెప్పారు. కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతోనే తాను వరంగల్‌కు వచ్చానని ఆయన తెలిపారు. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు అన్నీ తీసుకొని వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించనున్నట్లు తెలిపారు. అదే విధంగా హైదరాబాద్‌లో పనిచేస్తున్న చిన్నారి కుటుంబానికి అక్కడే డబుల్‌బెడ్‌రూం అందించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు దాదాపు ఒక నెలలోపు పోలీసులు విచారణ చేపట్టి నిందితునికి శిక్ష వేశారని గుర్తు చేశారు. ఈ కేసులో మీడియా ప్రతినిధుల కృషి ప్రశంసనీయమని అన్నారు. నిర్భయ కేసు విషయం నిందితులందరికీ శిక్ష పడిందిని, అలాంటి చట్టం ఈ కేసుకూ వర్తిస్తుందని అన్నారు. శ్రీహిత ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ సందర్భంగా శ్రీహిత తల్లి దండ్రులు జగన్, రచనలు నిర్భయ చట్టంలాగా మా కూతురు పేరు మీద కూడా ఒక చట్టం తీసుకురావాలని కోరగా పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా ప్రచార సాధనాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలను చైతన్య పరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డీసీపీ నర్సింహ, ఏసీపీ శ్రీ్ధర్‌లతో కేసు విషయాలను చర్చించారు. అంతకు ముందు శ్రీహత తల్లిదండ్రులను వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ పరామర్శించి ఓదార్చారు.
చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్