రాష్ట్రీయం

ప్రజావేదికను కూల్చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం చెంతన నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సోమవారం ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం జరుగుతున్న సమయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని, అక్రమాలను సహించేది లేదని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. తనతో సహా ఎమ్మెల్యేలు, మంత్రులెవరైనా అవినీతిపై అధికారులకు సిఫార్సు చేసినా ఒత్తిళ్లకు తలొగ్గరాదని స్పష్టం చేశారు. దోపిడీ నిర్మూలన కోసం వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామంటూనే ప్రజావేదిక గురించి ప్రస్తావించారు. ‘ఈ భవనం చట్టాలను ధిక్కరించి అవినీతితో నిర్మించింది.. ఇందులో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంత మంది అధికారులు సమావేశమయ్యాం.. నిబంధనల ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో 22 మీటర్ల వరద స్థాయికి పై బడి నిర్మాణాలు సాగించాల్సి ఉంది.. అయితే 19 మీటర్లులోపు నిర్మించిన ప్రజా వేదిక వరద స్థాయి కంటే తక్కువగా ఉందని, నిర్మాణానికి అనుమతి ఉండదని జలవనరులశాఖ ఈఈ అప్పట్లో టీడీపీ ప్రభుత్వానికి స్పష్టం చేశారని జగన్ గుర్తుచేశారు.
నదీ సంరక్షణ చట్టాలు..
లోకాయుక్త ఆదేశాలు..
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ ముందుగా ప్రజావేదిక నిర్మాణానికి రూ. 5 కోట్ల అంచనా వేసి రూ 8.9 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఒక అక్రమ నిర్మాణానికి నిబంధనలకు అతీతంగా గత ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజారిందో దీన్నిబట్టి అర్థమవుతోంది.. ఈ విషయాలను వివరించేందుకే ప్రజావేదికను కలెక్టర్ల సమావేశానికి ఎంపిక చేశామన్నారు. ఇక ఉపేక్షించేది లేదు.. రేపే కూల్చేయండని సీఎం జగన్ ఆదేశించారు. ఇక్కడి నుంచే మార్పు ప్రారంభం కావాలన్నారు. జిల్లాల్లో కూడా ప్రతి చోట అక్రమ కట్టడాలపై పరిశీలన జరపాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎస్‌డబ్ల్యు నర్సింగ్ కళాశాల నుంచి ఓ లేఖ తమకు అందిందని, ఇద్దరే ఫ్యాకల్టీలతో ప్రభుత్వ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా చట్టం, న్యాయం, రాజ్యాంగం ముందు అంతా సమానులేనని స్పష్టం చేశారు. గత రెండేళ్ల క్రితం రూ 8.9 కోట్ల వ్యయంతో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకారానికి టీడీపీ ప్రభుత్వం ఈ వేదిక నిర్మించింది. ఇందులో పార్టీ సమావేశాలు కూడా నిర్వహించారు. ప్రభుత్వ ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో తన నివాసంతో పాటు ప్రజా వేదికను కూడా ప్రతిపక్ష నేత హోదాలో తమకు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి గత కొద్దిరోజుల క్రితం చంద్రబాబు లేఖ రాశారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టింది. కాగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న కలెక్టర్లు, ఎస్పీల సమావేశాల కోసం ప్రజావేదికనే ఖరారు చేశారు.

చిత్రం... ప్రజావేదికలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్. చిత్రంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం