రాష్ట్రీయం

మానస సరోవర్‌లో చిక్కుకున్న నగర వాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల: మానస సరోవర్ యాత్రకు వెళ్ళిన నగరవాసులు అక్కడ చిక్కుకున్నట్టు వార్తా చానళ్లలో వచ్చిన కథనాలు ఆందోళనకు గురిచేశాయ. సదరన్ ట్రావెల్స్ యాజమాన్యంపై తమను పట్టించుకోలేదని సరిహద్దులో వదిలే శారని యాత్రికులు ఆవేదన చెందారు. ఈ నెల 13న తెలుగు రాష్ట్రాలకు చెందిన 44 మంది యాత్రికులు మానస సరోవర్ వెళ్లారు. అయితే తిరిగి వచ్చే క్రమంలో ట్రావెల్స్ నిర్వాహకులు చైనా సరిహద్దు ఇసాలో వదిలిపెట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నేత ముద్దాపురం మదన్‌గౌడ్ యాత్రికుల్లో ఒకరు. ఈ సందర్భంగా మదన్‌గౌడ్ వాట్సాప్ ద్వారా తమ సమస్యలను వీడి యో ద్వారా వెల్లడించారు. గత నాలుగు రోజులుగా ప్రపంచానికి సంబంధాలు లేని ప్రదేశంలో ట్రావెల్స్ నిర్వాహకులు వదిలేశారని ఆయన వాపోయారు. తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు అనారోగ్య సమస్యలలతో బాధపడుతున్నట్టు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సదరన్ ట్రావెల్స్ నిర్వాహకుల పై చర్య లు తీసుకోవాలని మదన్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం వచ్చిన వార్తలపై సైబరాబాద్ పోలీసులు స్పందించారు. యాత్రికులకు సం బంధించిన బంధువులు, స్నేహితులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని వారన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చింతగా చర్యలు తీసుకుంటామని సైబరాబా ద్ కమిషనర్ సజ్జన్నార్ స్పష్టం చేశారు.