రాష్ట్రీయం

ఎమ్సెట్ కౌనె్సలింగ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్సెట్ కౌనె్సలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. తొలి రోజు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి 23,715 మంది స్లాట్‌లను బుక్ చేసుకున్నారు. మిగిలిన వారు సైతం తమ స్లాట్‌లను టీఎస్‌ఎమ్సెట్ డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. సర్ట్ఫికేట్ల పరిశీలన 27వ తేదీ నుండి మొదలవుతుంది. జూలై 3 వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుంది. అలాగే 27వ తేదీ నుండి తమ ఆప్షన్లను సైతం నమోదు చేసుకోవచ్చు.
ఈసెట్‌లో 17337 మంది రిజిస్ట్రేషన్
ఈసెట్‌లో సోమవారం సాయంత్రం వరకూ 17337 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వెబ్ రిజిస్ట్రేషన్‌కు, స్లాట్‌ల నమోదును 25వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుందని నవీన్ మిట్టల్ చెప్పారు. సర్ట్ఫికేట్ల పరిశీలనకు 26వ తేదీలోగా హాజరుకావల్సి ఉంటుందని, తమ వెబ్ ఆప్షన్లను 27వ తేదీలోగా నమోదు చేయాలని చెప్పారు.