రాష్ట్రీయం

54 వీక్లీ ప్రత్యేక రెళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు 54 వీక్లీ ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య 28 రైళ్ళు, తిరుపతి - విశాఖపట్నం మధ్య 28 ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య నడిచే రైళ్ళు రాయనపాడు మీదుగా నడుస్తాయి. విశాఖపట్నం - సికింద్రాబాద్ (08501) మధ్య ఈనెల 30, జూలై 6,13,20,27, ఆగస్టు 3,10,17,24 తేదీల్లో నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ - విశాఖపట్నం (08502) మధ్య ఈనెల 31, జూలై 7,14,21,28, ఆగస్టు 4,11,18,25 తేదీల్లో ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం - తిరుపతి (08573) మధ్య ఈనెల 29, జూలై 6,13,20,27, ఆగస్టు 3,10, 17,24, సెప్టెంబర్ 1వ తేదీన రైళ్ళు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో తిరుపతి - విశాఖపట్నం (08574) మధ్య ఈనెల 30, జూలై 6,13,20,27, ఆగస్టు 3,10, 17,24, సెప్టెంబర్ 1వ తేదీన రైళ్ళను ఏర్పాటు చేసినట్లు ద.మ రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు.