రాష్ట్రీయం

నీట్ నేషనల్ కోటా గడువు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: నీట్ ర్యాంకు ద్వారా జాతీయ పూల్‌లో మెడికల్, డెంటల్ అడ్మిషన్ల తొలి దశ కౌనె్సలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. అన్ని రాష్ట్రాల్లో 15 శాతం సీట్లతో పాటు డీమ్డ్ వర్శిటీల్లో మెడికల్ అడ్మిషన్లను కూడా ఎంసీసీ చేపట్టింది. నీట్‌లో దేశవ్యాప్తంగా 15.19 లక్షల మంది రాస్తే 7 లక్షల 97వేల మంది అర్హత సాధించారు. ఇందులో ఇతరుల కేటగిరిలో 7,04,335 మంది, ఓబీసీ కోటాలో 63,789 మంది, ఎస్సీలో 20009, ఎస్టీలో 8455, ఇతరుల కోటా పీహెచ్ 266, ఓబీసీ పీహెచ్ 142, ఎస్సీ పీహెచ్ 32, ఎస్టీ పీహెచ్ 14 మంది అర్హత సాధించారు.
వీరంతా జాతీయ పూల్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. దీంతో పాటు ఆయా రాష్ట్రాల కాంపెటెంట్ అథారిటీ కోటాలో సీట్లు పొందేందుకు కూడా సంబంధిత రాష్ట్రాలవారు అర్హులే. తెలంగాణ స్థానిక కోకటా కింద ఉన్న 33044 మంది అర్హత సాధించారు, ఆంధ్రా నుండి 39039 మంది అర్హత సాధించారు.
అన్‌రిజర్వుడ్ కోటాలో 15 శాతం సీట్లకు ఆంధ్రా విద్యార్థులు తెలంగాణలో, తెలంగాణ విద్యార్థులు ఆంధ్రాలో పోటీ పడేందుకు అర్హులే. నీట్‌లో కనీసం 460 నుండి 470 మార్కుల వరకూ సాధించిన వారికి ఎంబీబీఎస్ సీటు ఏదో ఒక క్యాటగిరిలో దక్కే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో టాపర్‌కు వచ్చిన మార్కులు 695. అదే 579 మార్కులు సాధించిన విద్యార్థికి వచ్చిన ర్యాంకు 400, 565 మార్కులు సాధించిన విద్యార్థికి 550 ర్యాంకు వచ్చింది. రాష్ట్రంలో 4600 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1500 సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3100 సీట్లు ఉన్నాయి. అయితే మొత్తం సీట్లలో జాతీయ పూల్ సీట్లు 15 శాతం, అన్‌రిజర్వుడ్ కోటా 20 శాతం సీట్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ/బీసీ, వికలాంగుల కోటా, అమ్మాయిల కోటాతో పాటు ఎన్‌ఆర్‌ఐ కోటా, బీ కేటగిరి కోటా కేటాయింపులు జరగుతాయి. బీ కేటగిరి సీట్లను కాంపిటెంట్ అథారిటీ ద్వారానే భర్తీ చేస్తునే ఉన్నా, ఫీజు చాలా ఎక్కువగా ఉంది,
అలాగే ఎన్‌ఆర్‌ఐ కోటాకు సైతం యాజమాన్యం మెరిట్‌పైనే భర్తీ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ కాంపెటెంట్ అథారిటీ కోటా సీట్లకు రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 28వ తేదీ సాయంత్రం ముగుస్తుంది.