రాష్ట్రీయం

సుముహూర్తం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: సుముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న గురువారం, దశమి ఉదయం 11 గంటల సమయానికి కొత్త సచివాలయం, శాసనసభ సముదాయ భవనాల నిర్మాణాలకు భూమి పూజకు వాస్తుపండితులు ముహూర్తం ఖరారు చేశారు. భూమి పూజకు సచివాలయంలో డీ బ్లాక్‌కు వెనుక పొర్టికోకు ఎదురుగా ఉన్న లాన్స్‌ను, అసెంబ్లీ భవనానికి ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాలశాఖ ఇఎన్‌సి కార్యాలయ భవనానికి ఉత్తర దిశను ఎంపిక చేశారు. ఈ రెండు చోట్ల శంకుస్థాపన కార్యక్రమం కోసం ఆర్ అండ్ బీ అధికారుల పర్యవేక్షణలో నేలను చదునుచేసి గుంతలు తీశారు. కొత్తగా నిర్మించనున్న సచివాలయాన్ని 5 నుంచి 6 లక్షల మేరకు చదరపు అడుగుల విస్తీర్ణంలో చతురస్రాకారంలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత సచివాలయంలో భద్రతాపరంగా, అగ్నిప్రమాదాల నివారణపరంగా లోపాలు ఉన్నట్టు ఇదివరకే హోం, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అలాగే సచివాలయంలో సీఎం కార్యాలయానికి వెళ్లే దారి మూల మలుపులో అమ్మవారి ఆలయం, సీఎంఓ ఆఫీసుపై మసీదు నీడ పడటం తీవ్రమైన వాస్తు దోషంగా వాస్తుపండితులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భద్రత, అగ్నిప్రమాదాల నివారణ, వాస్తు ఈ మూడు ప్రధాన కారణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి తోడు సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితర వీఐపీలను కలువడానికి వచ్చే అతిథులు కోసం కనీసం సౌకర్యాలు లేకపోవడాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో హైటెక్ హంగులతో నిర్మించబోయే కొత్త సచివాలయాన్ని వందకు వందశాతం వాస్తుపూర్వకంగా, సౌకర్యవంతంగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల మేరకు 5 నుంచి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే సచివాలయానికి రూ. 400 కోట్లు ఖర్చు అవుతుందని రోడ్లు, భవనాలశాఖ అంచనా వేసింది. సచివాలయంతో పాటు శాసనసభ, శాసనమండలి, శాసనసభ సచివాలయం మూడు కార్యాలయాలను ఒకే సముదాయంలో నిర్మించడానికి ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బి ఇఎన్‌సి భవనాన్ని ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీనికి మరో రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజనీర్లు అంచనా వేశారు. ఏడాదిలో ఈ రెండు భవనాలను నిర్మించి ప్రభుత్వానికి అప్పగించే విధంగా టెండర్లలో నిబంధన పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే దసరా పండుగ నాటికి కొత్త సచివాలయంలో కొలువు దీరేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది.
27న టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు
ఈ నెల 27న మంచి ముహుర్తం ఉండటంతో అదే రోజు నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. తొలి సభ్యత్వాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీసుకోవడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇలా ఉండగా అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు టీఆర్‌ఎస్ పార్టీ విస్తతృ సమావేశాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను జిల్లా పరిషత్ చైర్మన్లు, చైర్ పర్సన్స్‌ను ఆహ్వానించారు. పార్టీ సంస్థాగత అంశాలతో పాటు పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.

చిత్రాలు..అసెంబ్లీ భవన నిర్మాణానికి ఏర్పాట్లు *సచివాలయం భూమి పూజకు ఏర్పాట్లు