ఎన్టీఆర్ గార్డెన్స్‌ను తొలగించకపోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: అంబేద్కర్ విగ్రహం కోసం ఎన్టీఆర్ గార్డెన్స్‌ను తొలగిస్తారని తాము అనుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం తీరుపై టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ సొత్తు అన్నట్టు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో రుద్రరాజు పద్మరాజుతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. అంబేద్కర్‌ను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తోందని ఆయన రెండు మార్లు పార్లమెంటుకు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని ఓడించిందని అన్నారు. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ చొరవ వల్లే రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారని, కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ మెంబర్‌గా పోటీ చేస్తే నెహ్రూ పనిగట్టుకుని ఓడించారని, అంబేద్కర్ తనకు పోటీ అవుతాడని నెహ్రూ భావించి పక్కన పెట్టించారని అన్నారు. ఎన్టీఆర్ కృషి వల్లనే 1990లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కృషి వల్లనే పార్లమెంటులో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దళిత నేత ప్రతిభాభారతిని కూడా స్పీకర్‌ను చేసిన ఘనత టిడిపిదేనని అన్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు, బిసిలకు, మైనార్టీలకు ఆనాడు ఎన్టీఆర్ దేశంలోనే మొదటిసారిగా రెసిడెన్షియల్ విద్యను ప్రవేశపెట్టారని , ఆతర్వాత ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజీవ్‌గాంధీ నవోదయ పాఠశాలను నెలకొల్పారని అన్నారు. ఈ సందర్భంగా పద్మరాజు మాట్లాడుతూ అంబేద్కర్ వారసత్వం కాంగ్రెస్‌దేనంటున్న సోనియాగాంధీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని పేర్కొన్నారు.

తిరుపతిలో 125 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

తిరుపతి, ఏప్రిల్ 13: అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా బుధవారం తిరుపతిలో 125 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. స్థానిక అంబేద్కర్ విగ్ర హం వద్ద నుంచి గాంధీరోడ్డు, నాలుక్కాళ్ల మండపం వరకు వేలాదిమందితో ఊరేగింపు నిర్వహించారు. మనువాదం వద్దు, మానవత్వం కావాలి అంటూ చేసిన నినాదాలతో పురవీధులు హోరెత్తాయి. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్సీ యండపల్లి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు చిత్తశుద్ధితో పాటించాలన్నారు.