రాష్ట్రీయం

ఏదో ఒకటి జరగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: దివాళా తీసిన ప్రభుత్వరంగ సంస్థలను మూయడమా? లేక వాటిని పునరుద్ధరించడమా? దీంట్లో ఏదో ఒకటి నిర్ణయం జరగాల్సిందేనని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలపై అత్యున్నతస్థాయి ప్రణాళికా సంస్థ బ్లూప్రింట్ రూపొందిస్తుందని ఆయన చెప్పారు. దారిద్య్ర నిర్మూలనపై ప్రాంతీయ స్థాయి సంప్రదింపుల సమావేశం బుధవారం స్థానిక హోటల్లో జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశ విశేషాలను పనగారియా మీడియాకు వివరించారు. నష్టాలతో మూతపడిన ప్రభుత్వరంగ సంస్థలను ఏం చేయాలన్న దానిపై రెండు వ్యూహాత్మక విధానాలను అవలంబించాలని ఆయన సూచించారు. ఇందులో ఒకటి ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడమా? లేక వాటిని పునరుద్ధరించడమా?, రెండవది వాటిలో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకొని పెట్టిన డబ్బులను రాబట్టుకోవడం ఈ రెండింటిలో ఏదో ఒక విధానాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థలను నీతి ఆయోగ్ గుర్తిస్తుందని బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల రూ.56,500 కోట్లను తిరిగి పొందవచ్చని అంచన వేసినట్టు పనగరియా వివరించారు. దారిద్రం ఏ మేరకు తగ్గిందో తెలుసుకోవడానికి మాత్రమే దారిద్రరేఖ వివరాలను వినియోగించుకుంటామని, అంతే కానీ దారిద్రరేఖ నిర్మూలన పథకాల అమలుకు దీంతో సంబంధం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయా రాష్ట్రాలు తాము ఎంపిక చేసుకున్న పద్ధతులను ఉపయోగించి దారిద్య్రరేఖకు దిగువనుండే వారిని గుర్తిస్తాయన్నారు. ఈ నెల 22వ తేదీన జైపూర్‌లో ఇదే తరహా సదస్సును నిర్వహిస్తున్నట్టు పనగారియా తెలిపారు. వాతావరణశాఖ ఈ ఏడాది వర్షాలు బాగా పడుతాయని సంకేతాలు ఇచ్చిందని, ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో బుధవారం జరిగిన దారిద్య్ర నిర్మూలనపై ప్రాంతీయ స్థాయి
సంప్రదింపుల సమావేశంలో ప్రసంగిస్తున్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా

అధికారుల ప్రాసిక్యూషన్‌కు నో
9 మంది ఐఎఎస్‌లను విచారించేందుకు
నిరాకరించిన కేంద్రం, తెలుగు రాష్ట్రాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: జగన్ అక్రమాస్తుల కేసులో ఇంతవరకు తొమ్మిది మంది ఐఎఎస్ అధికారులను సిబిఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనలను కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తిరస్కరించాయి. వై ఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో వీరందరిపై సీబీఐ అభియోగాలను మోపింది. ఇందులో డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆదిత్యానాథ్ దాస్, బిపి ఆచార్య, ఎస్‌ఎన్ మెహంతి, కె రత్నప్రభ, బి శ్యాంబాబు, పి శామ్యూల్, మురళీధర్ రెడ్డి, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఉన్నారు. హైకోర్టు గత ఏడాది జూన్ 18వ తేదీన ఐఎఎస్ అధికారి రత్న ప్రభపైన వచ్చిన అభియోగాలను కొట్టివేసింది. మరో సీనియర్ ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య పైన కేసు విచారణ జరగకుండా హైకోర్టు ఈ ఏడాది మార్చి 24వ తేదీన స్టే ఇచ్చింది. గత నెల 31వ తేదీన మరో ఐఎఎస్ అధికారి ఎస్‌ఎన్ మహంతిపైన కేసు విచారణ జరగకుండా హైకోర్టు స్టే ఇచ్చింది.