ఆంధ్రప్రదేశ్‌

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/కర్నూలు/అనంతపురం, ఏప్రిల్ 13: రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మరో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. వడగాలులతో పాదచారులు, ద్విచక్రవాహనాలు, బస్సుల్లో ప్రయాణించేవారు ఉక్కిరి బిక్కిరవువుతున్నారు.
బుధవారం కడపలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుని నిప్పులకొలిమిగా మారింది. అనంతపురంలో 43.1 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా సగటున 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కర్నూలు నగరం, నంద్యాల పట్టణాల్లో 43, ఆదోనిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బకు నలుగురు మృతి
అనంతపురం, కడప జిల్లాల్లో బుధవారం వడదెబ్బకు నలుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లా అగళి మండలం రామనపల్లి చిగురప్ప (58), నార్పలలో చాకలి కాటమయ్య (60), కడప జిల్లా సింహాద్రిపురం మండలం వైకొత్తపల్లికి చెందిన ఓబులేసు (35), ఓబులవారిపల్లి మండలం మంగళంపల్లికి చెందిన వై వెంకటయ్య (70) వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరాంధ్రలో నలుగురు మృతి
విజయనగరం/శ్రీకాకుళం: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బుధవారం వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రోజు కూలీ చేపల రమణ(45) వడదెబ్బతో మృతి చెందాడు. గంట్యాడ మండలం మధుపాడకు చెందిన రైతు బి.తమ్మురాజు(52) పొలంలో పనులుచేస్తూ వడదెబ్బతో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన ఆనందం భద్రయ్య (52) వడదెబ్బతో మృతి చెందాడు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఉదయపురానికి చెందిన ఎం.పార్వతమ్మ(70) వడదెబ్బతో చనిపోయింది.