రాష్ట్రీయం

కాళేశ్వరానికి వరద ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జూలై 6: కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుందని, అందుకు అనుగుణంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కనె్నపల్లి, మేడిగడ్డ ప్రాజెక్టులను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణకు నిరంతరం పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడాలని ఆయన సూచించారు. మహారాష్టల్రో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ప్రవాహం పెరుగడంతో గోదావరి నదిలో వరద ఉధృతి పెరిగిందని, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల పర్యాటకుల సందర్శనకు కొంత విరామం చూపాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు ఇరువైపుల రెండురాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అక్కడి పోలీసులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు, ప్రాజెక్టు అధికారులు సమీక్షించాలని ఎస్పీ అన్నారు. గోదావరికి వరద ఉధృతి పెరుగుతుందని చేపలు పట్టేందుకు ఎవరు వెళ్లవద్దని మహదేవ్‌పూర్ సీఐ రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో శనివారం డప్పుచాటింపు వేసి ప్రచారం నిర్వహించారు.