తెలంగాణ

గరుడ వాహనంపై వెంకన్న అభయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 8: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల్లో చివరి రోజు రాత్రి శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
సాయంత్రం 6గంటలకు ఊంజల్ సేవ జరిగింది. ఆ తరువాత లక్ష్మీహారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకువచ్చారు. రాత్రి 8గంటలకు గరుడ వాహనంపై స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొంటారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ట, నిష్కళంకత, ఉపకారణగుణం, సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ కె.్ధనంయుడు, ఏఈఓ డి.లక్ష్మయ్య, సూపరింటెండెంట్ రమణయ్య, ముని చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ బి.అనిల్‌కుమార్, ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
16న సర్వ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, చంద్రగ్రహణం కారణంగా ఈనెల 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా 16వ తేదీ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వదర్శనం ఉండదు. చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 5 గంటల వరకే కంపార్ట్‌మెంట్లలోకి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు.
ఈ నేపథ్యంలో 16వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే ఐదు గంటల మాత్రమే భక్తులకు దర్శన సమయం ఉంటుంది. ఈ కారణంగా దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 17వ తేదీ ఉదయాత్పూర్వం 1.31 నుంచి 2.49 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. 17వ తేదీ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా చేపడతారు. ఉదయం 12 గంటలకు సర్వదర్శనం ప్రారంభం అవుతుంది.