బిజినెస్

ఒడిశాలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 10: ఒడిశా రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. బొగ్గు బ్లాకుల అనుమతికి అవసరమైన సహకారం అందించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యప్రసాద్ పాథిని ఆయన భువనేశ్వర్‌లో కలిసి ఈమేరకు చర్చించినట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో వచ్చిన వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సింగరేణి సీఎండీ అందజేశారు. ఈసందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాకులో 34కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దేశ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం తెలంగాణతో పాటు ఒడిశా రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపడుతోందన్నారు. బొగ్గు బ్లాకులకు, రైల్వే లైన్‌కు సంబంధించి వెంటనే అనుమతులు ఇచ్చేలా సహకరించాలని ఒడిశా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది బొగ్గు ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి సమీప గ్రామాల యువతకు స్వయం ఉపాధి అందించేందుకు ఉచిత డ్రైవింగ్, టైలరింగ్ వంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శ్రీ్ధర్ వివరించారు. కార్యక్రమంలో మైనింగ్ అడ్వైజర్ డీఎన్ ప్రసాద్, జీఎం విజయరావు, డీజీఎం రవీంద్రచౌదరి, అదనపు మేనేజర్ ప్రజేష్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రవీణ్ కశ్యప్ పాల్గొన్నారు.

చిత్రం... ఒడిశా సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కు అందజేస్తున్న సింగరేణి సీఎండీ శ్రీ్ధర్