రాష్ట్రీయం

తెలంగాణది అత్యాశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూలై 11: గోదావరి, కృష్ణానదీ జలాల వినియోగంలో నికర జలాలు, మిగులు జలాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణతో చర్చించాల్సిన అవసరం ఉందని రాయలసీమ ఉద్యమనేత, మాజీమంత్రి డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాష్ట్రానికే కాకుండా కరవు ప్రాంతమైన రాయలసీమ జిల్లాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలానికి 75 శాతం డిబెంటబులిటీ ప్రకారం 440 టీఎంసీలు వస్తాయనే నిపుణుల అంచనాను బట్టి కనీసం 400 టీఎంసీలనైనా కరువు ప్రాంతాలకు వినియోగించాలని అన్నారు. కడప నగరంలోని వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గోదావరి, కృష్ణా, పెన్నానదుల అనుసంధానం, రాయలసీమ నీటిపై గురువారం సమగ్ర చర్చా వేదిక జరిగింది. సీపీఐ జిల్లాకార్యదర్శి జి.ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మైసూరారెడ్డి మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై రెండు తెలుగు రాష్ట్రాలు ఏవో ప్రతిపాదనలు చేస్తున్నట్లు పత్రికల్లో చూస్తున్నామని, ఆ ప్రతిపాదనలన్నీ ‘అన్నం ముద్ద తల చుట్టూ తిప్పుకుని నోట్లో పెట్టుకున్న’ చందంగా ఉన్నాయని అన్నారు. గోదావరి నీళ్లను పోలవరం కాలువ వెడల్పు చేయడం ద్వారా నాగార్జునసాగర్‌కు తేవాలని, అలాగే పట్టిసీమతో 40 టీఎంసీలు రాయలసీమ కోసం అనే అంశంపై జీవో ఇచ్చి చట్టబద్దత తేవాలని, పోలవరం నుంచి పులిచింతల ప్రాజెక్టుకు గోదావరి నీళ్లను మళ్లించాలని ఇలా కింది భాగాన ఉన్న ప్రాజెక్టులకు గోదావరి నీళ్లను ఇచ్చి పై భాగాన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోని 400 టీఎంసీలను రాయలసీమ ప్రాజెక్టులకు, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, దిండి తదితర ప్రాజెక్టులకు వినియోగించాలని అన్నారు. అంతేగానీ ప్రతిరోజు 2 టీఎంసీల నిలిచిన నీళ్లను ఎత్తిపోసి శ్రీశైలంకు తీసుకురావాలంటే ఎకరాకు రూ.50వేలు ఖర్చు వస్తుందని అన్నారు. దాని బదులు పోలవరం కాలువలను వెడల్పుచేయడమే ఉత్తమమని అన్నారు. అలాకాకుండా తెలంగాణ భూభాగంలో ప్రాజెక్టులను నిర్మించి శ్రీశైలంలోకి గోదావరి నీళ్లను ఎత్తిపోసే ప్రతిపాదనల వల్ల భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ రాజకీయ మైత్రి ఎన్నిరోజులుంటుందో రాజకీయాల్లో చెప్పలేమని, అక్కడా ఇక్కడ ప్రభుత్వాలు మారిన తర్వాత నైనా సమస్యలు ఉత్పన్నవౌతాయని అన్నారు. ఏ నిర్ణయాలైనా ట్రిబ్యులన్ అవార్డులలో పొందుపరచాల్సి ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మాట్లాడుతూ గోదావరి మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్‌కే వాడుకునే హక్కు ఉందన్నారు. ఇందులో తెలంగాణకు ఎలాంటి హక్కులేదన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేసీఆర్ మాటలకు లొంగి చర్చలు జరపడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌ను ఎలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు. మనకు రావాల్సిన నీటిని తెలంగాణకు మళ్లించుకుని తనవరకు తాను లబ్దిపొందే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దీనికి సీఎం జగన్ చర్చలతో ముడిపెట్టడం తగదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి సీమకు రావాల్సిన నీరు రావడం లేదని, కానీ రంగారెడ్డి జిల్లాలోని పాలకుర్తి ప్రాజెక్టుకు మాత్రం నీరు ఇస్తున్నారన్నారు. నాగార్జున సాగర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ సీమ జిల్లాలకు నీరు రాకుండా అడ్డుపడుతున్న ఘనత తెలంగాణదే అన్నారు. గోదావరి జలాల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నింపగలిగితే ఇందులో 460 అడుగులు తక్కువ కాకుండా నిల్వ ఉంచితే రాయలసీమలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు నీళ్లందే అవకాశాలున్నాయన్నారు. గోదావరి మిగులు జలాలపై తెలంగాణకు ఎలాంటి హక్కులేదని ఆయన స్పష్టం చేశారు. సీడబ్ల్యుసీ అనుమతి లేకుండా బ్రిజేష్ ట్రిబునల్ అనుమతి లేకుండా తెలంగాణలో అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, అందువల్ల గోదావరి మిగులు జలాలకు గండికొట్టి ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్ దృష్టిసారించారని ఆయన ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర రాజకీయ విశే్లషకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గోదావరి మిగులు జలాల పేరుతో తెలంగాణ నీటిని తరలించుకుపోయేందుకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులన్నింటికీ ఎత్తిపోతల పథకాలు చేపట్టారని, వీటికి 20 లక్షల మెగావాట్ల విద్యుత్ అవసరమన్నారు. దీంతో ఆ రాష్ట్రం విద్యుత్ పేరుతో మిగులు జలాలను భారీగా వాడుకుని ఆంధ్రప్రదేశ్‌ను ముంచేసే పరిస్థితి ఉందన్నారు. సీపీఐ రాష్టక్రార్యవర్గ సభ్యులు జి.ఓబులేసు మాట్లాడుతూ శ్రీశైలం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే గోదావరి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులను నింపాలంటే ఇంజనీరింగ్ నిపుణులు, రాజకీయ నేతలు, రైతు ఉద్యమ నేతలను ఏకం చేసి అనేక జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించి ముఖ్యమంత్రికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖరరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డితోపాటు సీపీఐ జిల్లాకార్యదర్శి జి.ఈశ్వరయ్య పాల్గొన్నారు.

చిత్రం...కడప ప్రెస్‌క్లబ్‌లో నదుల అనుసంధానంపై జరిగిన సదస్సులో మాట్లాడుతున్న మైసురా రెడ్డి