రాష్ట్రీయం

రాష్ట్ర రుణ బకాయిలు రూ. 2.61 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: ఈ ఏడాది మే 30 తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రూ. 2, 61, 303 కోట్ల రుణ బకాయిలను కలిగి ఉందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో తెలిపారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, కొలుసు పార్థసారథి, ధర్మాన ప్రసాదరావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తేదీ 2014, జూన్ రెండవ తేదీ నాటికి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 1,30,654 కోట్ల రుణ బకాయిలు మొత్తాన్ని కేటాయించారన్నారు. ఇందులో ప్రభుత్వ రుణం రూ. 97,124 కోట్లు, ప్రజాపద్దులపై రూ. 33,530 కోట్లు అన్నారు.
చిత్రం... శాసనసభలో మాట్లాడుతున్నఆర్థిక శాఖ మంత్రి బుగ్గన