రాష్ట్రీయం

మేం లంచం తీసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ : ‘ఇక నుంచి ఏ పనికీ లంచం తీసుకోం. మా శాఖల్లో లంచం అనేది లేకుండా రూపుమాపుతాం. అందుకు ప్రజలు మాపై భరోసా ఉంచుకోండంటూ’ రెండుశాఖల సిబ్బంది ముందుకు వచ్చారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌ను కలిసిన పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది తమ నిర్ణయాన్ని వెల్లడించారు. శుక్రవారం నుండే మా భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని వారు వెల్లడించారు. గతంలో ఏమి జరిగిందో కానీ ప్రస్తుతం మాత్రం ఇక ఈ రెండుశాఖల్లో అవినీతి లేకుండా ప్రజలకు సేవలు అందించడమే మార్గదర్శకంగా నిలుస్తామని తేల్చిచెప్పారు. ఇందుకు రెండు శాఖల సిబ్బందిని మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అభినందిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ జడ్పీ మీటింగ్ హల్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ సిబ్బంది తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పోస్టర్‌ను విడుదల చేశారు. అవినీతిరహిత జిల్లాగా మార్చడానికి రెండుశాఖల సిబ్బంది ముందుకు రావడం మంచి శుభపరిణామం అని కలెక్టర్ వెల్లడించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగితా శాఖల వారు కూడా ముందుకు వస్తే బాగుంటుందని జిల్లాకు మంచిపేరు వస్తుందని ఆయన తెలిపారు. మా భరోసా అనే కార్యక్రమాన్ని గ్రామగ్రామాన విస్తృతమైన ప్రచారం చేయాలని అందుకు అందరూ సహకరించాలని కోరారు. కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అందుకు ప్రతి గ్రామపంచా యతీలో ప్రజలతో ముఖాముఖిగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం నుండే మా భరోసా అనే కార్యక్రమానికి జిల్లాలో శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఎక్కడైనా ఈ రెండు శాఖల సిబ్బందితో పాటు ఇంకెవరైనా ప్రజల నుండి లంచాలు తీసుకున్నా, అడిగినా 08542-241165 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. 24గంటల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ వెల్లడించారు. ప్రచార సాధనాలు, పత్రికలు ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అవగాహన కల్పించాలన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మా భరోసా కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. రెండుశాఖల సిబ్బంది తీసుకున్న నిర్ణయాన్ని తాను హర్షిస్తున్నానని మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేవిధంగా అందరూ పనిచేయాలని ఆయన కోరారు. విలేఖరుల సమావేశంలో స్పెషల్ కలెక్టర్ క్రాంతి, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, జడ్పీ సిఇఓ యాదయ్య, డీపీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్, రెవెన్యూశాఖ ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ రోనాల్డ్‌రోస్