రాష్ట్రీయం

రీ పోస్టుమార్టం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీ ఫార్మశీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గత జనవరిలో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ క్రమంలో శనివారం ఆయేషా మీరా తల్లిదండ్రులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులు గుంటూరు నుండి తెనాలి వెళ్లారు. రక్త నమూనాలు సేకరించే సమయంలో మతపెద్దలు అడ్డుచెప్పడంతో ఒకింత వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. అయితే కోర్టు ద్వారా అనుమతులు తీసుకుని ఆయేషా మీరా తల్లిదండ్రుల రక్తనమూనాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విజయవాడలో బీ ఫార్మశీ చదువుతున్న ఆయేషా మీరా 2007 డిసెంబర్ 26న హత్యకు గురయింది. ఈ కేసులో దోషిగా నిర్థారణైన సత్యంబాబు కొనే్నళ్ల శిక్ష అనుభవించిన అనంతరం హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలయ్యాడు. తరువాత కేసు పునర్‌విచారణలో భాగంగా 2018 డిసెంబర్ 7వ తేదీన అప్పటి రాష్ట్రప్రభుత్వం ఈ కేసును సీబీఐకు అప్పగించింది. అప్పటి నుండి ఈ కేసులో వందలాది మంది సాక్షులను విచారించి వారి నుంచి సీబీఐ అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. తాజాగా కేసులో పురోగతి కోసం ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. హత్య జరిగి దాదాపు 12 సంవత్సరాలు గడిచినా, ఘటన జరిగినప్పుడు ఏమైనా బలమైన గాయాలు ఉంటే అవి ఎముకలపై స్పష్టంగా ఉంటాయని విశ్వాసంతో ముగ్గురు అధికారుల బృందం తెనాలిలోని ఆయేషా మీరా తల్లి షంషాద్‌బేగంను కలిసి విచారణకు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని, అనంతరం తల్లిదండ్రుల డీఎన్‌ఏ అవసరమవుతుందని వారికి తెలిపారు. ఆయేషా తల్లి షంషాద్ బేగం కూడా సీబీఐ ద్వారా తమకు న్యాయం జరుగుతుందని అధికారులతో అన్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 12 ఏళ్ల అనంతరం ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలంటే మత సాంప్రదాయాల ప్రకారం మత పెద్దల అనుమతి కూడా తప్పనిసరైన నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు, ఇబ్బందులు విచారణకు తలెత్తకుండా ముందుగానే కోర్టు నుంచి అనుమతి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం తెనాలిలో ఆయేషా మీరా తల్లిదండ్రులను కలిసి వివరాలు తెలియజేసి విజయవాడ వెళ్లినట్లు తెలుస్తుంది. ఏమైనప్పటికీ విచారణ అనంతరం బాధితులకు న్యాయం చేకూరే విధంగా సీబీఐ తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న విచారణ పట్ల ఆయేషా మీరా బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆయేషా మీరా (ఫైల్)