రాష్ట్రీయం

అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం కాన్వాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : సాధాణంగా సీఎం కాన్వాయ్ వస్తుందంటే ఆ మార్గంలో పోలీసుల హడావుడి సామాన్యంగా ఉండదు. కనీసం అరగంట ముందు నుంచే ట్రాఫిక్ నిలిపి వేయడం సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిపివేసే సమయాన్ని గణనీయంగా తగ్గించారు. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం రేణిగుంట నుంచి గన్నవరం తిరిగి వచ్చిన సీఎం జగన్ రోడ్డు మార్గాన తాడేపల్లికి బయలుదేరారు. రహదారిపై వెనుక ప్రైవేట్ అంబులెన్స్ వస్తుండటాన్ని గమనించిన సీఎం కాన్వాయ్ ఆ అంబులెన్స్‌కు దారిచ్చి ముందుకు పంపించడం విశేషం.