రాష్ట్రీయం

ఆర్టీసీ విలీనంపై త్వరలో నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు, ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ నెలాఖరులోపల నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రవాణా శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కూడా ఏపీఎస్‌ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఇటీవల కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇప్పటికే జగన్ సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అదే బాటలో ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారనే ఆశలో కార్మిక సంఘాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించి ఐదేళ్లయింది. గత ఐదేళ్లుగా కార్మిక సంఘాలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి,. రాష్ట్రప్రభుత్వం గత ఏడాది జూన్ నెలలో పది మంది నిపుణులతో కమిటీని టీఎస్‌ఆర్‌టీసీపై అధ్యయనం చేసేందుకు నియమించింది. ఈ కమిటీ ఇంతవరకు ఎనిమిద సార్లు సమావేశమైంది. గత ఏడాది ఆగస్టు 10వ తేదీనుంచి ఈ ఏడాది మే 10వ తేదీ వరకు టీఎస్‌ఆర్‌టీసీ స్థితి గతులపై విస్తృతంగా అధ్యయనం చేసింది. ఈ కమిటీలో టీఎస్‌ఆర్‌టీసీ, కర్నాటక రోడ్డు రవాణా సంస్థ అధికారులు, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్లు, అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియా అధికారులు ఉన్నారు. ప్రస్తుతం టీఎస్‌ఆర్‌టీసీ దాదాపు రూ. 3000 కోట్ల వరకు లోటుతో ఉంది. రెండేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నగర పరిధిలో తిరుగుతున్న ఆర్టీసి సర్వీసులను ఆదుకునేందుకు వీలుగా రూ.198 కోట్ల నిధులను సమకూర్చిన విషయం విదితమే. నిపుణుల కమిటీలో ఎటువంటి విధి విధానాలను సమకూర్చుతుందనే విషయమై ఆర్టీసి వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లోపల ప్రభుత్వం ఈ నివేదికను అధ్యయనం చేసి విలీనం చేయడంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విలీనం చేయడం వల్ల ప్రభుత్వంలో ఇతర శాఖల మాదిరిగానే సాలీనా బడ్జెట్‌లో ఆర్టీసికి నిధుల కేటాయింపు ఉంటుందని టీఎస్‌ఆర్‌టీసీ ఈయూ నేత కె రాజిరెడ్డి చెప్పారు. ఎక్సైజ్ డ్యూటీ, విలువ ఆధారిత పన్నుల వల్ల టీఎస్‌ఆర్‌టీసీ నిధుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. సంస్థ రెవెన్యూపై ప్రతికూల ప్రభావం పడుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా త్వరలోనే తీపి వార్తను వెంటామనే ఆశతో ఉన్నట్లు కార్మిక వర్గాలు తెలిపాయి.