రాష్ట్రీయం

మెజార్టీ మున్సిపాలిటీలు మావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్ : త్వరలో జరుగనున్న మున్సిపాలిటీలలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా వ్యూహాం రూపొందిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ వారు ఊహలోకంలో ఉన్నారని కాలం కలిసొచ్చి నాలుగు సీట్లు గెలువగానే అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 135 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒడుదుడుకులు సహజమని అయినా పూర్వ వైభవంగా తధ్యమన్నారు. ‘అధికార పార్టీ అంటే ఎవరి అయ్య జాగీర్ కాదు. ఎవరైన పోదలుచుకంటే వెళ్లండి. నాకు అభ్యంతరం లేదు ఊగిసలాటలు వద్దు’అని తీవ్ర స్వరంతో అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఇటీవల ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో వచ్చిన సీట్లకు మించిరావన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను నిరుద్యోగులు, రైతులు నిలదీస్తారని ఒక్క మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒక్కటీ నిర్మించలేదని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని హుజూర్‌నగర్, నేరడిచర్ల రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
హుజూర్‌నగర్ పట్టణంలో త్వరలో పాదయాత్ర చేసి ఇంటింటికి వెళతానని ఆయన ప్రకటించారు. గత ఐదున్నర సంవత్సరాలలో ప్లెక్సీలు, పోటోలు తప్ప మున్సిపాలిటీ నుండి పట్టణంలో ఏం అభివృద్ది చేశారని ప్రశ్నిస్తానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. హుజూర్‌నగర్ మన్సిపాలిటీ వార్డుల విభజనలో అక్రమాలు జరిగాయని తన దృష్టికి రాగానే కలెక్టర్, మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవికి ఫిర్యాదు చేశానని 2,3 రోజుల్లో సవరిస్తామని హమీ ఇచ్చారని అన్నారు. 100 శాతం హుజూర్‌నగర్‌లోనే ఉండి మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించటానికి తన సర్వ శక్తులు వినియోగిస్తానని పీసీసీ చీఫ్ చెప్పారు.
టీఆర్‌ఎస్ వారు పట్టణంలో కనీసం రోడ్లపై ఉన్న గుంటలు కూడా పూడ్చలేదని, కేవలం ప్లెక్సీలకే పరిమితమైయ్యారని ఉత్తమ్ అన్నారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, హుజూర్‌నగర్, కోదాడ, నేరడిచర్ల మున్సిపల్ ఇన్‌చార్జ్ ప్రేమ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...హుజూర్‌నగర్ పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి