రాష్ట్రీయం

విద్యుత్ రంగం ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 14: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన విద్యుత్ రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో సమూల మార్పులు తెస్తామన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే కఠిన నిర్ణయాలకు వెనకాడేదిలేదని తేల్చిచెప్పారు. విద్యుత్ రంగ పరిరక్షణకు ప్రభుత్వం చొరవ చూపకపోతే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యుత్, సాగునీరు, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు ఆదివారం రాష్ట్ర ఇంధనవనరులు, అటవీ, పర్యావరణశాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారన్నారు. పగటిపూట 9గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి ఆరా తీశారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నివేదిక ప్రకారం 2019-20లో
ఆదాయ అవసరాలు రూ. 35,857 కోట్లు కాగా డిస్కంలకు ఈ ఏడాది మే నెలాఖరుకు జెన్‌కో, సాంప్రదాయేతర ఇంధనం (ఎన్‌సీఈ) వంటి విద్యుత్ సంస్థలు, ఇతరత్రా కలిపి మొత్తం రూ. 18, 375 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున డిస్కంలు ఈ చెల్లింపులు జరపలేదని అదే సమయంలో ప్రభుత్వం దీర్ఘ కాలంగా రూ. 10,400 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించారు. దీనికితోడు 2015-16 నుండి 2018-19 మధ్యకాలంలో డిస్కంలపై ‘మస్ట్న్’్ర ప్రాతిపదికన సౌర, పవన విద్యుత్ కొనుగోలు భారం రూ. 2636 కోట్ల వరకు ఉందన్నారు. 2019-20కి మరో రూ. 13 వందల కోట్ల భారం పడనుందని తెలిపారు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితి దృష్ట్యా విద్యుత్ రంగాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్, సాగునీరు, వ్యవసాయ రంగాలే కీలకమని 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా తమ ప్రభుత్వం వ్యవసాయ రంగ పరిరక్షణతో పాటు పారదర్శకతతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తద్వారా వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఇతర రంగాలకు అందుబాటులో 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యాలను నిర్దేశించిందని వివరించారు. విద్యుత్ రంగంతో పాటు అన్ని రంగాల్లో ప్రజాహితమైన విధానాల కోసం కఠిన నిర్ణయాలు తప్పవని పునరుద్ఘాటించారు. విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రజానుకూల చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్ట్‌ల నిర్వహణ అంశాల్లో లొసుగులు సరిదిద్దాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి బాలినేని తెలిపారు. ఏపీ జెన్‌కోను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షిస్తుందని చెప్తూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అన్నివిధాల చర్యలు చేపడతామన్నారు. వ్యవసాయానికి పూర్తి స్థాయిలో 9గంటల పగటిపూట విద్యుత్ సరఫరాకు అవసరమైన రూ. 17 వందల కోట్లను ముఖ్యమంత్రి తక్షణమే మంజూరు చేశారని గుర్తుచేశారు. రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి ప్రభుత్వం అత్యతంత ప్రాధాన్యత ఇచ్చిందని ఇంధన వనరులశాఖ ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. మొత్తం కేటాయింపులు రూ. 6881 కోట్లలో వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ కోసం రూ. 4525 కోట్లు కేటాయించారని గతేడాదితో పోలిస్తే 60 శాతం అధికంగా ఉందని వివరించారు. రైతుల అవసరాలు తీర్చటానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి బడ్జెట్ దోహద పడుతుందన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఏపీ జెన్‌కో సీఎండీ బి శ్రీ్ధర్, ట్రాన్స్‌కో జేఎండీలు కేవీఎన్ చక్రధర్‌బాబు, పి.ఉమాపతి, డిస్కంల సీఎండీలు నాగలక్ష్మి సెల్వరాజన్, ఎ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి