రాష్ట్రీయం

ఘనంగా ప్రారంభమైన శాకంబరీదేవి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి): ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖఃశాంతులతో ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరిగాలని ఆకాంక్షిస్తూ శాకంబరీదేవి అలంకారంలో ఉన్న శ్రీకనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ శ్రీ వికారి నామ సంవత్సర ఆషాఢ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు మూడు రోజులపాటు వివిధ రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ప్రూట్స్‌ను సర్వాభరణాలుగా ధరించి తొలి రోజైన ఆదివారం భక్తులకు శ్రీ శాకంబరీదేవి అలంకారంతోదివ్య దర్శనమిచ్చింది. ఈ మహోత్సవాలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి శుభ సూచకంగా శనివారం అర్ధరాత్రి నుండే వర్షాలు కురవటంతో ఆనందదాయకమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి పర్చేందుకు సియం వైయస్ జగన్ అనేక పధకాలను రూపొందించినట్లు వివరించారు. వచ్చిన భక్తులు అందరు మూడు రోజులు పాటు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఆలయాధికారులు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంత్రి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఉదయం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ యం పద్మ కుటుంబ సమేతంగా శాకంబరీదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. కాగా, హైదరాబాద్‌లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఉరేగింపుకమిటీ ఆధ్వర్యంలో జమ్మిదొడ్డి నుండి ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు బంగారు బోనాలతోపాటు అమ్మవారికి పట్టుచీర, పూజా సామాగ్రిని సమర్పించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. సుమారు 1000 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ ఊరేగింపుగా ఘాట్‌రోడ్ మీదుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈవో వి కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది దాతలు ఇచ్చిన కూరకాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ప్రూట్స్‌ను అమ్మవారి మూల విరాట్‌తోపాటు అన్ని ఉపాలయాలు, శ్రీమల్లిఖార్జున మహామంటపంలోని ఉత్సవమూర్తి, ఆలయ ప్రాంగణం, అమ్మవారి రాజగోపురం ముందుభాగాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆదివారం ఉదయం 8గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యావాహనం, దీక్ష ధారణ, కలశస్ధాపన, అగ్నిప్రతిష్ఠాపన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అలకరించిన కూరగాయలతో ప్రత్యేకంగా కదంబం ప్రసాదాన్ని తయారు చేయించి భక్తులకు పంపిణీ చేశారు. ఈ మూడు రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి అలంకారానికి కావాల్సిన కూరలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈవో కోటేశ్వరమ్మ భక్తులకు విజ్ఞప్తి చేశారు.