రాష్ట్రీయం

కళకళ.. వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి గోచరిస్తోంది. సరైన వర్షాల్లేక ఇటు పరీవాహక ప్రాంతం నుంచి.. అటు ఎగువ నుంచి నీరు రాకపోవడంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయ. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఎక్కడా వర్షాల జాడ లేదు. దీంతో ఖరీఫ్ సాగు నుంచి ఏ విధంగా గట్టెక్కాలో తెలియని పరిస్థితిలో రైతులు తలలు పట్టుకొంటున్నారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర, కర్నాటక ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో అల్మట్టికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వర్షాలు బాగా పడి ఆల్మట్టి పూర్తిగా నిండితే తప్ప రాష్ట్రంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. నిజాంసాగర్ ప్రాజెక్టు సైతం అడుగంటి ఎడారిని తలపిస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజి మాత్రం నిండు కుండను తలపిస్తోంది. కనె్నపల్లి వద్ద ఐదో మోటార్‌ను రన్ చేసి పెద్ద ఎత్తున నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో ఇక్కడి బ్యారేజీ జలకళను సంతరించుకొంది.

చిత్రాలు.. ఆల్మట్టి జలాశయం*

కామారెడ్డి: నీళ్లు లేక బోసిపోయిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ *
భూపాలపల్లి: 5వ మోటార్ ప్రారంభంతో గ్రావిటీ కెనాల్‌లో నీరు ఎత్తిపోస్తున్న దృశ్యం