రాష్ట్రీయం

షార్‌లో రాష్టప్రతి కోవింద్ బస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 14: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)ను ఆదివారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందర్శించారు. రేణిగుంట నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో నేరుగా షార్‌కు విచ్చేశారు. షార్‌లోని హెలిపాడ్ వద్ద రాష్టప్రతికి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి నేరుగా నక్షత్ర అథితిగృహానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేందర్ సింగ్‌తో కలిసి షార్‌లో నూతనంగా నిర్మించిన రెండో వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌ను లాంఛనంగాప్రారంభించారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా రెండో ప్రయోగ వేదిక వద్దకు చేరుకొని ప్రయోగానికి సిద్ధంగా వున్న చంద్రయాన్-2 మిషన్‌ను తిలకించారు. అక్కడ రాష్ట్రపతికి ఇస్రో చైర్మన్, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ చంద్రయాన్-2 ప్రయోగం గురించి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగ వివరాలతో పాటు షార్ విషయాలను అడిగి తెలుసుకొన్నారు. మళ్లీ నక్షత్ర అథితిగృహానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. వేకువజామున 2:30 గంటలకు మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకుని చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించి ఉదయం 9 గంటలకు తిరిగి పయనమవ్వనున్నారు.
మీడియా పడిగాపులు
భారత ప్రథమ పౌరుడు షార్ పర్యటనకు వస్తే కనీసం మీడియాకు కూడా షార్ అధికారులు సమాచారం ఇవ్వలేదు. స్థానిక మీడియా ప్రతినిధులే కాకుండా జాతీయ మీడియాకు చెందినవారు కూడా ఉదయం నుంచే షార్ ప్రధాన గేటు వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీనిపై షార్ అధికారులను అడిగినా సమాధానం చెప్పకపోవడంతో మీడియాకు ఇబ్బందులు తప్పలేదు. రాత్రి 10 గంటల వరకు కూడా షార్ ప్రధాన గేటు వద్ద సమాచారం కోసం మీడియా పడిగాపులు కాచినా సమాచారం దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. కనీసం రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఫొటోలను సైతం విడుదల చేయకపోవడం గమనార్హం.