రాష్ట్రీయం

యురేనియం భయంతో వణుకుతున్న నల్లమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జూలై 14: తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతంలో యురేనియం నిల్వలు ఉన్నాయా? పరిమాణం ఎంత, నాణ్యత ఎంత మేరకు ఉందన్న దానిపై సర్వే చేసేందుకు కేంద్ర అటవీ, పర్యవరణ శాఖ పరిధిలోని అటానమిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) అటవీ సలహామండలికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపడంతో యురేనియం ఫోబియాతో గత కొన్ని రోజుల నుండి నల్లమల ప్రజానీకం భయభ్రాంతులకు లోనవుతున్నారు. యురేనియం నిల్వలను అనే్వషించేందుకు కేంద్ర, అటవీ, సలహా మండలి మే 22న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నా పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. రాష్ట్ర, కేంద్ర వన్యప్రాణి మండలి గతంలోనే ఆమోదం తెలపడంతో నాగర్ కర్నూల్, నల్గొండ, జిల్లాల పరిధిలో నాణ్యతతో కూడిన నిక్షేపాలు పెద్దఎత్తున ఉన్నాయని ఈ ప్రాంతం పూర్తిగా నల్లమల అడవులలో ఉండటంతో సర్వే అనుమతి కోసం ఏఎండీ రెండేళ్ళ క్రితం అటవీశాఖకు దరఖాస్తు చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ళ, నల్గొండలోని నారాయణపూర్ ప్రాంతాల్లో సర్వేతో పాటు అక్కడి భూముల్లో బోర్ డ్రిల్లింగ్ ద్వారా యురేనియం నిల్వల్ని కనుగొనేందుకు అనుమతి కోరింది. ఏఎండీ ప్రతిపాదనల్లో పూర్తి వివరాలు లేకపోవడంతో అవసరమైన పత్రాలు, నిర్ణీత నమూనాలతో పంపాలని కేంద్ర అటవీశాఖ సూచించింది. నల్లమల అటవీప్రాంతంలోని 83 చదరపు కిలోమీటర్ల వరకు యురేనియం అనే్వషణ కోసం కేంద్ర, అణుశక్తిసంస్థకు పర్యావరణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించడంతో నల్లమలవాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి అమ్రాబాద్, పదర మండలాల్లోని 18 గ్రామ పంచాయతీలపై ప్రత్యక్షంగా ప్రభావం పడనుందని, పరోక్షంగా 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలపై కూడా యురేనియం నిక్షేపాల వల్ల నష్టాలు కలుగుతాయని పర్యవరణవేత్తలు, స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. దానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలు జరపడం వల్ల ఎగువన ఉన్న కృష్ణానది, శ్రీశైలం పరీవాహక ప్రాంతంతో పాటు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు ప్రవహించే నీటిపై కూడా ప్రభావం ఏర్పడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వేల ఎకరాలను సాగు చేస్తున్న రైతుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం చూపనుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
భూమిలో ఉన్నంత వరకు యురేనియం క్షేమకరమైందని బయటకు రాగానే అది మొదట గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి ఆక్సైడ్‌గా విడిపోయి గాలిలో కలిసిపోతుందని దీనికి అణుధార్మికత వస్తుందని దాని ఫలితంగా ప్రతి రసాయన చర్యలో అత్యంత ప్రమాదకరమైన బీటా, గామా కిరణాలను వెదజల్లుతుందని గాలిలో ప్రవేశించిన తరువాత మనుషుల, జంతువుల శరీరాల్లో ప్రవేశించి ఎముకల్లో స్థిర పడిపోతుందని, దీనివల్ల సునాయాసంగా పలు రకాల కేన్సర్ వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు, పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి దాదాపు కొన్ని వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియోధార్మిక పదార్థాలు వేల సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయని తద్వారా గాలి, నీరు, కలుషితమై ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోవడం, వికృత సంతానం, పూర్తిగా సంతానలేమి, స్ర్తి, పురుషుల్లో శారీరక మార్పులు కలుగుతాయని అభిప్రాయ పడుతున్నారు. ఏదిఏమైనా యురేనియం తవ్వకాలపై సర్వేతో నల్లమల మరోసారి ఉలిక్కిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి అధికారికంగా నల్లమల ప్రజల, వన్యప్రాణి మనుగడకు ముప్పు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చిత్రం...యురేనియం నిక్షేపాలు నల్లమలలో లభ్యమయే ప్రాంతాలను గుర్తించిన ఛాయా చిత్రం