రాష్ట్రీయం

నిండుకుండలా అన్నారం బ్యారేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, జూలై 14: తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టులోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని అన్నారం బ్యారేజీ నిండుకుండలా కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం కనె్నపల్లి వద్ద 5వ మోటార్‌ను ఇంజనీరింగ్ అధికారులు రన్ చేశారు. దీంతో పంపుహౌస్‌లోని 5 మోటార్లు ఆదివారం సాయంత్రం నుంచి అన్నారం బ్యారేజీలోకి పెద్ద ఎత్తున నీరు ఎత్తిపోస్తున్నాయి. అన్నారం బ్యారేజీలో 3.57 టీఎంసీల నీటి సామర్ధ్యం ఉంది. అన్నారం బ్యారేజీ మొత్తం 10.87 టీఎంసీల సామర్ధ్యం గల ఈ ప్రాజెక్టు క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారేజీలోకి మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు మూసివేయడంతో ఎగువకు నీటి ప్రవాహం చేరడంతో కనె్నపల్లి వద్ద పంపుహౌస్ నుండి అన్నారం బ్యారేజీకి నీటిని ఎత్తిపోస్తున్నారు. కనె్నపల్లి పంపుహౌస్ వద్ద నాలుగు పంపుల ద్వారా నిరంతరం నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆదివారం నాటికి 95.9 మీటర్ల ప్రవాహంతో నీరు ప్రవహిస్తోంది. కనె్నపల్లి వద్ద 3,4,5,6 మోటార్ల నుండి నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి చేరవేస్తున్నారు. దీంతో అన్నారం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 114.700 మీటర్ల లెవల్‌లో నీటి ప్రవాహం ఉంది.
చిత్రం...వరద నీటితో నిండిన అన్నారం బ్యారేజీ