రాష్ట్రీయం

బీజేపీలోకి ‘సోమారపు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జులై 14: తెలంగాణ రాష్ట్ర సమితిలో కొంత కాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్న మాజీ ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ ఇటీవలే గులాబీ గూటికి గుడ్ బై చెప్పగా... తాజాగా భారతీయ జనతా పార్టీ సొమారపు సత్యనారాయణకు వెల్‌కమ్ చెప్పింది. సమర్థవంతమైన నాయకునిగా పరిగణిస్తూ ఆయనను పార్టీలోకి ఆహ్వానించింది. ఏకంగా భారతీయ జనతా పార్టీకి చెందిన కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, అరవింద్‌లు ఆదివారం గోదావరిఖనిలోని సొమారపు సత్యనారాయణ స్వగృహానికి స్వయంగా వెళ్లి మీరు బిజెపిలోకి రావాలంటూ ఆహ్వానించడం ఇక్కడ ఒక చర్చనీయాంశమయ్యింది. టిఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కొరవడిందని... స్థానికంగా పార్టీలో అరాచకాలు విపరీతమయ్యాయని... తన అనుచరులపై వేధింపులకు పాల్పడుతున్నారన్న... ఆరోపణలు చేస్తూ సత్యనారాయణ పార్టీకి గుడ్‌బై చెప్పి కొద్ది రోజులకే బిజెపి నుంచి పిలుపు రావడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. సొమారపు సత్యనారాయణ ఇంటికి వచ్చిన బిజెపి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లు సత్యనారాయణను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తూ అక్కడ కాసేపు ఎంపీలు విలేకరులతో మాట్లాడారు. సమర్థవంతమైన నాయకులకు, ప్రజా సంక్షేమాన్ని కోరే నేతలకు బిజెపి ఎప్పుడూ సాధారంగా ఆహ్వానం పలుకుతుందని, దీనిలో భాగంగానే సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ ప్రజాక్షేత్రంలో దశాబ్ధాల పాటు ప్రజాప్రతినిధిగా పని చేసిన సత్యనారాయణను బిజెపిలోకి స్వయంగా ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చామని చెప్పారు.
టిఆర్‌ఎస్‌లో కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఉందని, తెలంగాణ వ్యాప్తంగా టి ఆర్ ఎస్ అహంకార ధోరణికి పాల్పడుతుందని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. భవిష్యత్‌లో టి ఆర్ ఎస్‌లో నుంచి బిజెపిలోకి భారీగా రానున్నారని చెబుతూ రాష్ట్రంలో సత్యనారాయణ సేవలు బిజెపికి అవసరమని చెప్పుకచ్చారు. తెలంగాణలో టి ఆర్ ఎస్‌కు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు.