రాష్ట్రీయం

ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఆదివారం విడుదల చేసింది. మొదటి సంవత్సరం ఫలితాలను మరో వారం రోజులలో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. కాగా, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో సప్లిమెంటరీలో 37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 41 శాతం, బాలురు 35 శాతం ఉత్తీర్ణత సాదించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఆదివారం బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్‌లో డైరెక్టర్ అశోక్‌కుమార్ విడుదల చేశారు. వివరాలలోకి వెళ్తే.. సప్లిమెంటరీ పరీక్షకు మొత్తం 1,60,487 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 60,600 మంది ఉత్తీర్థులయ్యారు. ఉత్తీర్ణతలో ఆదిలాబాద్ జిల్లా 62 శాతంతో మొదటి స్థానంలో నిలువగా, వికారాబాద్ జిల్లా 25 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. మార్కుల మెమోలను సోమవారం ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అశోక్‌కుమార్ పేర్కొన్నారు. రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు అభ్యర్థులు ఈనెల 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. రీ కౌంటింగ్‌కు పేపర్‌కు రూ. 100, రీ-వెరిఫికేషన్‌కు పేపర్‌కు రూ. 600 చొప్పున ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని అశోక్‌కుమార్ వివరించారు.
చిత్రం...ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తున్న బోర్డు డైరెక్టర్ అశోక్‌కుమార్ తదితరులు