రాష్ట్రీయం

‘సర్వమంగళ’గా భద్రకాళి అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు శనివారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 గంటలు నిత్యాహ్నికం పూర్తి చేసిన తర్వాత అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్ఛాశక్తిని ‘మాత్రాక్రమంలోను జ్ఞాన శక్తిని ‘సర్వమంగళ’ గాను అలంకరించి పూజారాధనలు చేశారు. దశమహా విద్యలలో అత్యవిద్యయైన కాళి సపర్యాక్రమంలో త్రయోదశి అధిదేవత మన్మధుడు. పంచతన్మాత్రల నుండి పంచ భూతములు పుట్టాయ. పంచభూతముల యందు అనగా ఆకాశ, వాయు, తేజో, జల, పృధ్వి యుందు వాటి సూక్ష్మాంశములైన గుణములు వరుసగా శబ్ద, స్పర్శరూప, రస, గంధములు రూపమున అమ్మవారు వ్యాపించి ఉంది. అలాంటి సమస్త జీవుల సర్వేంద్రియుల యందు అధార శక్తియై అమ్మవారు వ్యాపించియుంది, అలాంటి అమ్మవారి విభూతియే ఈ మాత్రా, సర్వమంగళానిత్య అమ్మవారు భక్తులకు సమస్త మంగళములను, శుభములను ప్రాప్తింపజేస్తుందని ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు దేవాలయానికి పోటెత్తారు. ఈనెల 6న మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి నిత్యాహ్నికం నిర్వర్తించిన అనంతరం అమ్మవారికి పలు విధములైన శాకములతో శాకంబరి అలంకారము ప్రారంభమవుతుంది. ఈ అలంకారము ఉదయం 6 గంటల వరకు జరుగుతుంది. అలంకారం జరుపుతున్న సందర్భంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం వీలుపడదని, అలంకారమునకు సుమారు ఐదు గంటల వ్యవధి పడుతుందని అన్నారు. అలంకారము జరిపిన పిమ్మట పూజానంతరం ఉదయం 8 గంటల నుండి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారని తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం సర్వదర్శనంతో పాటు విశిష్ట దర్శనం, ధర్మదర్శనం, క్యూలైన్లు యథాపూర్వం ఏర్పాటు చేసినట్టు ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు.